రేవంత్ అలజడితో చిక్కుల్లో కేటీఆర్ ?

వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ ను అకస్మాత్తుగా బర్తరఫ్ చేయడం ఇప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతూనే ఉంది.ఈ వ్యవహారంలో టిఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలన్నీ ఈటెల రాజేందర్ కు మద్దతుగా నిలిచాయి.

 Revanth Sensational Coments On Ktr Lands Issue-TeluguStop.com

కెసిఆర్ తన కుమారుడు కేటీఆర్ కు ఇబ్బందులు లేకుండా చేసుకునేందుకు సీనియర్ నాయకులని తపిస్తున్నారనే విమర్శలు ఎన్నో వస్తున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి  టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ పై భూకబ్జా ఆరోపణలు చేశారు.

ఈ వ్యవహారంలో కొంతమంది మంత్రులపైన ఆయన ఆరోపణలు చేయడమే కాకుండా దానికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టడం కలకలం గా మారింది.

 Revanth Sensational Coments On Ktr Lands Issue-రేవంత్ అలజడితో చిక్కుల్లో కేటీఆర్ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దేవరయంజల్  సీతారామ స్వామి ఆలయ భూములను ఈటెల రాజేందర్ , ఆయన అనుచరులు కబ్జా చేశారని ఆరోపణలపై నియమించిన విచారణ కమిటీ తదితర అంశాలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

అసలు సీతారామ స్వామి ఆలయ భూములను కొనుగోలు చేసిన వాళ్ళల్లో కెసిఆర్ కుమారుడు కేటీఆర్ తో పాటు నమస్తే తెలంగాణ దామోదర్ కు భూములు ఉన్నాయన్నారు.వాటిని బ్యాంకుల్లో తాకట్టుపెట్టి వందల కోట్లు రుణాలు తెచ్చుకున్నారు అంటూ రేవంత్ విమర్శలు చేశారు.

దీనికి సంబంధించిన డాక్యుమెంట్ లను ఆయన బయట పెట్టారు.అలాగే నమస్తే తెలంగాణ పత్రిక కు ప్రింటింగ్ ప్రెస్ సైతం సీతారామ స్వామి ఆలయ భూముల్లో ఉందని రేవంత్ ఆరోపించారు.

ఆ భూములను బ్యాంకులో తాకట్టు పెట్టి వందల కోట్లు తెచ్చుకున్నారు అంటూ విమర్శించారు.అలాగే మరో మంత్రి మల్లారెడ్డి పైన విమర్శలు చేశారు.అదే ప్రాంతంలో మల్లారెడ్డి ఏడు ఎకరాల భూమిని కబ్జా చేసి ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని రేవంత్ విమర్శలు చేశారు.ఇక ఈ దేవరయాంజల్ కూడా మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో ఉండడంతో ఈ వివాదం మొత్తాన్ని సీబీఐకి ఇవ్వాలంటూ రేవంత్ డిమాండ్ చేశారు.

అలాగే నిషేధిత జాబితాలో ఉన్న 437 సర్వేలు మంత్రి కేటీఆర్ నమస్తే తెలంగాణ సిఎండి దామోదర్ రావు కు భూములు ఉన్నాయని, దానికి సంబంధించిన కాపీలను రేవంత్ బయటపెట్టారు.

అలాగే మంత్రి మల్లారెడ్డి సర్వే నెంబర్ 658 లో ఏడు ఎకరాలు ఆక్రమించి ఫామ్ హౌస్ కట్టుకున్నారు అని, 2015 లో కేటీఆర్ 11 లక్షలకు ఎకరం చొప్పున కోట్ల విలువ చేసే భూములను తక్కువ ధరకు కొనడంపైనా రేవంత్ అనుమానం వ్యక్తం చేశారు.

అంతేకాదు ఈ భూములు ధరణిలో హైడ్ కేటగిరీ కింద ఉంచారని, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.భూ కబ్జా ఆరోపణ పై మంత్రి ఈటల రాజేందర్ ను తొలగించిన కెసిఆర్ అదేవిధంగా కేటీఆర్, మల్లారెడ్డి లను మంత్రి పదవి నుంచి తప్పించాలని, సిబిఐ విచారణ చేయించాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు.

అయితే రేవంత్ ఆరోపణలతో కేటీఆర్ చిక్కుల్లో పడ్డట్టుగా కనిపిస్తున్నారు.గతంలోనే కేటీఆర్ ఫార్మ్ హౌస్ వ్యవహారంపైనే రేవంత్ రచ్చ రచ్చ చేశారు.

ఇప్పుడు ఈ అంశం పై రేవంత్ టార్గెట్ చేసుకున్నారు.

.

#Telangana #Etela Rajendar #KtrFarm #Revanth Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు