తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతున్న పరిస్థితి ఉంది.రేవంత్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే కాస్త బలపడిందని ఘంటాపథంగా చెప్పవచ్చు.
అయితే ఇక ఇప్పటికే కాంగ్రెస్ బలహీనపడ్డ నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి పర్యటనలు చేస్తూ అక్కడ నియోజకవర్గంలోని కాంగ్రె స్ శ్రేణులను ఉత్సాహపరుస్తూ మరల కాంగ్రెస్ పార్టీని సదరు నియోజకవర్గంలో బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే తాజాగా కొల్లాపూర్ లో రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే.
కొల్లాపూర్ లో జరిగిన మన ఊరు మన పోరు కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై సంచలన కామెంట్స్ చేశారు.
శ్రీనివాస్ గౌడ్ రోడ్డు మీద పోతే కుక్క కూడా కరవదని చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో సంచలనం రేపాయి.
వాల్మీకి బోయల్ని ఎస్టీలలో చేర్చకుండా మాదాసి కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్ లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తోందని రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. అయితే రేవంత్ చేసిన కామెంట్స్ పై శ్రీనివాస్ రెడ్డి స్పందించలేదు.

అయితే రేవంత్ ఇక బలహీనంగా ఉన్న జిల్లాలో, నియోజకవర్గంలో టీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలను టార్గెట్ చేస్తూ ముందుకెళ్ళే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.అయితే టీఆర్ఎస్ లో ఇంకా ఎన్నికల వాతావరణం అనేది ఇంకా మొదలు కాలేదు కాబట్టి రానున్న రోజుల్లో ప్రతీ విమర్శకు ప్రతి విమర్శ చేసే అవకాశం ఉంది.అయితే ఎంత మేరకు రేవంత్ రెడ్డి రానున్న రోజుల్లో ఏఏ విషయాల్లో టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తారనేది రానున్న రోజుల్లో మరింతగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఏది ఏమైనా రానున్న రోజుల్లో రాజకీయం రణరంగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.







