రేవంత్ కు అన్నీ సవాళ్లే ? ఇవన్నీ ఇబ్బందులే ?

కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంతగా అధిష్టానంపై ఒత్తిడి పెంచినా, చివరకు రేవంత్ రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఉనికి కోల్పోకుండా ఉండాలన్నా,  అధికారంలోకి రావాలన్నా, రేవంత్ వంటి చురుకైన, ధైర్యవంతమైన నేత అవసరమని అధిష్టానం గుర్తించింది.

 Problems For Revanth Reddy In Pcc Chief Post, Revanth Reddy, Telangana, Trs, Pcc-TeluguStop.com

అందుకే సీనియర్ నాయకులను పక్కన పెట్టి మరీ రేవంత్ కు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది.అసలు టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన అతి స్వల్ప కాలంలోనే ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం అంటే ఆషామాషీ కాదు.

కాకపోతే ఆయన టిఆర్ఎస్ పార్టీ పై పోరాడుతూ, కేసీఆర్ కేటీఆర్ అవినీతి వ్యవహారాలను తెలుగులోకి తెస్తూ, నిత్యం టిఆర్ఎస్ పోరాడుతూనే వస్తుండడం, అలాగే తెలంగాణలో బలం పెంచుకుంటున్న బిజెపి పైన అంతే స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తుండడం ఇవన్నీ ఆయనకు ప్లస్ గా మారాయి.ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంటా భయట రేవంత్ అనేక సవాళ్లను ఎదుర్కోవలసిన పరిస్థితి కనిపిస్తోంది.
పూర్తిగా తనకు వ్యతిరేకంగా పార్టీలో వ్యవహారాలు చేస్తూ వస్తున్న సీనియర్ నాయకులు అందరిని కలుపు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది.వారి వ్యవహార శైలి నచ్చకపోయినా, రేవంత్ వారితో సన్నిహితంగా మెలగాల్సిందే.

అయితే వారు ఎంత వరకు సహకరిస్తారు అనేది అనుమానమే.దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం రోజురోజుకు తగ్గిపోతోంది.

ఈ సమయంలో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.నిరంతరం పోరాటాలు చేస్తూనే ప్రజల్లో కాంగ్రెస్ ముద్ర పడేలా బిజెపి టిఆర్ఎస్ లకు ధీటుగా ఎదగాల్సి ఉంటుంది.

ఇదే సమయంలో మీడియా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ, తన సొంత ఇమేజ్ తో పాటు , పార్టీ ఇమేజ్ పెరిగేలా వ్యవహరించాల్సి ఉంటుంది.

Telugu Bandi Sanjay, Congress Senior, Pcc, Problemsrevanth, Rahul Gandhi, Revant

తెలంగాణ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండడం రేవంత్ కు కలిసివచ్చినా అదే సమయంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా తన ప్రసంగాలకు పదును పెట్టాల్సి ఉంటుంది.అలాగే డిసిసి అధ్యక్షులుగా తన సొంత టీమ్ ను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా నిరంతరం పార్టీ కార్యక్రమాలు చేపట్టే విధంగా రేవంత్ ఎప్పటికప్పుడు వ్యూహాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది.అయితే డిసిసీ, పిసిసి పదవుల్లో పూర్తిగా తన వర్గం వారిని నియమించుకోవాలి అంటే అది సాధ్యమయ్యే పనికాదు.

ఈ దశలో ఇంట బయట సవాళ్ళను ఎదుర్కొని రేవంత్ ఏవిధంగా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube