రేవంత్ కు కలిసిరాని ఒంటరి పోరాటం ? 

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ కు ఊపిరి పోసేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా,  అవి ఏవీ వర్కవుట్ కావడం లేదు.టిఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేసి , ఆ స్థానంలో కాంగ్రెస్ కూర్చోబెట్టాలి అనే తాపత్రయంతో రేవంత్ గట్టిగానే కష్టపడుతున్నారు.

 Revanth Reddy Who Is In Trouble Due To Senior Leaders In The Party, Congress, Bj-TeluguStop.com

పాదయాత్ర లు, ఆందోళనలు, నిరసనలు ఎలా ఎన్ని రకాలుగా ఆయన పోరాటం చేస్తున్న, పెద్దగా కలిసి రావడం లేదు.ఈ పరిస్థితులు ఏర్పడనికి సొంత పార్టీలోని నాయకులు ఒక కారణం గా కనిపిస్తున్నారు.

ఏది చేసినా ఆయన స్వలాభం కోసం అని,  రాజకీయంగా ఎదిగేందుకు, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చి సీఎం కుర్చీలో కూర్చొబెట్టెందుకు ఆయన ఈ ఎత్తుగడలు వేస్తున్నారనే అభిప్రాయం పార్టీ సీనియర్ నేతల లోనూ ఎక్కువగా కనిపిస్తోంది.దీనికి తోడు కాంగ్రెస్ అధిష్టానం సైతం ఆయనకు ప్రాధాన్యం ఇస్తూ ఉండడంతో రాజకీయంగా ఆయన మరింత బలపడితే తెలంగాణలో తమ ప్రభావం తగ్గిపోతుందని ఉద్దేశం ఉండడంతో, కాంగ్రెస్ సీనియర్లు ఆయనకు సహకరించకపోవడం, నిత్యం అధిష్టానానికి ఏదో ఒక విషయమై ఫిర్యాదు చేస్తూ వస్తున్నారనే ప్రచారం చాలా కాలం నుంచి వినిపిస్తూనే ఉంది.

ఇక రేవంత్ కు సైతం ఈ విషయం బాగా తెలియడంతోనే పార్టీ సీనియర్లు సహకరించిన,  సహకరించకపోయినా ఒంటరిగానే అన్ని వ్యవహారాలను చక్కబెట్టేస్తూ వస్తున్నారు.అలాగే ప్రతి ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారానికి దిగుతూ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ కు ఊపిరి పోసేందుకు ప్రయత్నాలు చేస్తున్న, పెద్దగా వర్క్ అవుట్ కావడం లేదు.

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య రాజకీయం నడుస్తోంది.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో  టిఆర్ఎస్ లేకపోతే బిజెపి తెలంగాణ లో అధికారం సంపాదిస్తుంది తప్ప కాంగ్రెస్ కు ఛాన్స్ లేదనే అభిప్రాయము  జనాల్లోకి వెళ్లిపోయింది.

దీనంతటికి కారణం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గ్రూపు విభేదాలు.దుబ్బాక, జిహెచ్ఎంసి, నాగార్జునసాగర్, ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ లు ఇలా చెప్పుకుంటూ వెళితే తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా,  కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది.

దీనికి కారణం నాయకుల మధ్య సఖ్యత లేకపోవడమే.ఇప్పటికే తెలంగాణలోని చాలా జిల్లాల్లో కాంగ్రెస్ బలం పూర్తిగా తగ్గిపోయింది.

అక్కడ అక్కడ పార్టీకి బలం ఉంది అనుకున్న చోట కూడా ఇప్పుడు బలహీనం అవుతూ వస్తోంది.  పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే మరింత ఉత్సాహంతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాను అన్నట్లుగా అధిష్టానం దగ్గర వ్యవహారాలు చేస్తున్నా, దానిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సీనియర్లు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తూ వస్తుండడంతో,  ఈ తలనొప్పులు భరించలేక కాంగ్రెస్ అధిష్టానం కొత్త పిసిసి అధ్యక్షుడు ఎంపిక ను వాయిదాలు వేస్తూ వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube