ఆ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన రేవంత్ ? కేసీఆర్ కూ వార్నింగ్ ?

దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే కాస్త బలం పుంజుకుంటున్నట్టు కనిపిస్తున్న జాతీయ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తలెత్తాయని, ముఖ్యంగా రాహుల్, ప్రియాంక గాంధీ రెండు వర్గాలుగా విడిపోయారని, ప్రియాంక వర్గంలో రేవంత్ రెడ్డి చేరిపోయినట్టుగా వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి.ఈ వ్యవహారం రేవంత్ రెడ్డి వరకు చేరడంతో, ఆయన ఈ విషయంపై ఘాటుగా స్పందించారు.

 Congress Leader Revanth Reddy Warns Cm Kcr, Telangana Cm Kcr, Ktr, Farmhouse Iss-TeluguStop.com

అసలు ఈ ఆరోపణల్లో కాస్త కూడా నిజం లేదని, తాను ప్రియాంక వర్గంలో చేరినట్లుగా వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని, అసలు కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి గ్రూపులు లేవని, అవన్నీ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న తప్పుడు ప్రచారాలు అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.

అసలు ఈ విషయం పై కనీసం తన వివరణ తీసుకోకుండా, నిరాధారమైన వార్తలు ప్రచారం చేయడంపై మండిపడ్డారు.

అసలు ఇటువంటి వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కాకపోతే ఈ వ్యవహారాలు మరీ శృతి మించడంతోనే తాను స్పందించి క్లారిటీ ఇస్తున్నాను అంటూ రేవంత్ చెప్పుకొచ్చారు.అలాగే సొంత పార్టీ నాయకులు కొంతమంది ఈ విధమైన తప్పుడు కథనాలను ప్రచారం చేయిస్తూ అధిష్టానం వద్ద తన పై వ్యతిరేకత పెరిగేలా చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తనకు సమాచారం ఉందని రేవంత్ చెప్పుకొచ్చారు.

తనపై ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా, తాను భయపడనని, ధీటుగా సమాధానం చెబుతాను అంటూ క్లారిటీ ఇచ్చారు.

Telugu Congressrevanth, Farmhouse, Priyanka, Revanth Reddy-Telugu Political News

ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ వ్యవహారాన్ని ప్రస్తావించి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా, కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు రావడం లేదని, అసలు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలన్న విషయంపై ఉన్న శ్రద్ధ, తెలంగాణ ప్రజలపై కేసీఆర్ కు లేదని రేవంత్ విమర్శించారు.పరిపాలన మొత్తం అధికారులపై వదిలేసి, కేసీఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని మండిపడ్డారు.

వరంగల్ లో కేటీఆర్ హడావిడి చేయడం వెనుక కేసిఆర్ వ్యూహం ఉందని, తాను లేకపోయినా కేటీఆర్ సమర్థవంతంగా తన బాధ్యతలను నిర్వహించగలరు అనే అభిప్రాయం పార్టీ నాయకుల్లోనూ, ప్రజల్లోనూ కలిగించే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube