'కారు' ఎక్కబోతున్న రేవంత్ రెడ్డి ..? మంతనాలు జరుపుతున్న గులాబీ పార్టీ !

గత కొంతకాలంగా టిఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులను కారు ఎక్కించేందుకు తగిన వ్యూహరచన చేస్తోంది.బలమైన నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ప్రతిపక్ష పార్టీల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలని చూస్తోంది.

 Revanth Reddy Want To Join In Trs-TeluguStop.com

ఇప్పటికే తెలంగాణలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు తమకు ఇప్పటి వరకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉండి నోరు ఎక్కువగా పారేసుకునే నాయకులను పార్టీలో చేర్చుకుని వారి నోరు నొక్కడంతో పాటు తమ రాజకీయ ప్రత్యధి పార్టీలకు ఝలక్ ఇవ్వాలని చూస్తోంది.ఇప్పటికే కొంతమందిని ఈ విధంగా చేర్చేసుకున్న గులాబీ పార్టీ మరికొంతమందిని ఆఫర్ లో పెట్టేసుకుని ఉంది.

కేసీఆర్ మీద పోటీ చేయడమే కాదు ఆయన మీద ఎప్పుడూ… దుమ్మెత్తిపోసే ‘ఒంటేరు’ ను కూడా టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు పావులు కదిపారు.దీనిలో భాగంగా ఆయనను ఎంఎల్సీ చేసి మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ ప్రకటించారు.రేపో మాపో ఆయన పార్టీలో చేరడం ఖాయమే అయిపొయింది.ఇక ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే… తెలంగాణాలో తమకు రాజకీయ ప్రత్యర్థిగా ఉండడమే కాదు… అడుగడుగునా అద్దంపడుతూ… నిద్ర లేకుండా చేస్తున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ని కూడా ఏదో ఒకరకంగా ఒప్పించి ‘కారు’ లో కూర్చోబెట్టాలని చూస్తున్నారు.

ఆయన కనుక పార్టీలో చేరితే ఇక తమను తెలంగాణాలో ఎదుర్కునే వారు కానీ… అడ్డుతగిలే వారు కానీ ఉండరని… ఇక మనం ఆడింది ఆట పాడింది పాత అన్నట్టుగా ఉంటుంది అని టీఆర్ఎస్ అధినాయకత్వం ఆలోచన చేస్తోంది.?

రేవంత్ రెడ్డి టాలెంట్ ఏంటో అందరికి బాగా తెలుసు.కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులకంటే కొత్తగా ఆ పార్టీలో చేరిన రేవంత్ కు అధిష్టానం ఎక్కడలేని ప్రాధాన్యత కల్పించింది.ఇక ఇప్పుడు కాకపోయినా.

భవిష్యత్తులో ఎప్పటికైనా టీఆర్ ఎస్ పార్టీకి మేకులా మారే వ్యక్తి రేవంత్.అలాంటి రేవంత్ ని ఇప్పుడు పార్టీలో పార్టీలో చేర్చుకుని ఎదురులేకుండా చేసుకోవాలని టీఆర్ఎస్ చూస్తోంది.

అందుకే ఆయనకు ఎంఎంఎల్సీ పదవి కూడా ఇచ్చేందుకు ఆఫర్ కూడా రాయబారం కూడా పంపారట.అయితే టీఆర్ఎస్ లో చేరే విషయంలో రేవంత్ ఏ విషయం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అట.ఆ పార్టీలో చేరితే ఇక తనకు రాజకీయ మనుగడ ఉండదని… ఇప్పటివరకు తనకు ఉన్న పాపులారిటీ కూడా ఒక్కసారిగా తగ్గిపొద్దని ఆయన తన సన్నిహితుల దగ్గర చర్చించాడట.అయితే ఎట్టి పరిస్థితుల్లో అయినా రేవంత్ ను టీఆర్ఎస్ లో చేర్చాల్సిందే అనే కృత నిశ్చయంతో టీఆర్ఎస్ పావులు కదుపుతోందని ఆ పార్టీలో నాయకులు చర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube