రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గినట్టేనా ? కేసీఆర్ కు చేసిన విజ్ఞప్తి ఏంటి ?

Revanth Reddy Request A Telangana CM KCR , Revanth Reddy, TRS KCR, KTR Farm House

తెలంగాణాలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.వీరిద్దరి మధ్య నిప్పు లేనిదే మంటలు పుడుతుంటాయి.

 Revanth Reddy Request A Telangana Cm Kcr , Revanth Reddy, Trs Kcr, Ktr Farm Hous-TeluguStop.com

కేసీఆర్ హవాను ఏదో ఒక రకంగా అడ్డుకోవడంతో పాటు, తన పరపతి పెంచుకోవాలని కేసీఆర్ భావిస్తూ ఉంటారు.అలాగే రేవంత్ ను పూర్తి స్థాయిలో కట్టడి చేసి తెలంగాణాలో ఆయన హవా లేకుండా చేయాలనీ కేసీఆర్ భావిస్తూ ఉంటారు.

తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యవహారం నిత్యకృత్యమే అన్నట్టుగా ఉంటుంది.మొన్నటి వరకు వీరిద్దరి మధ్య పోరు అదే స్థాయిలో జరిగింది.

ముఖ్యంగా సీఎం కేసీఆర్, కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని రేవంత్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.కేటీఆర్ కు చెందిన ఫామ్ హౌస్ లో ఎన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, రేవంత్ హడావుడి చేశారు.

Telugu Congressrevanth, Kcr Ktr Farm, Revanth Reddy, Revanthreddy, Trs Kcr-Polit

కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరా ఎగురవేయడం, ఫామ్ హౌస్ పరిసరాలను చిత్రీకరించడం, దీనిపై కేసు నమోదు చేయడం, ఆయన జైలుపాలవ్వడం ఇలా రచ్చ రచ్చ జరిగింది.ఇది ఇలా ఉండగా రేవంత్ విషయంలో కేసీఆర్ కాస్త మెత్తబడినట్టుగా కనిపిస్తోంది.తెలంగాణాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు ఓ విజ్ఞప్తి చేశారు.జైళ్లలో ఉంటున్న ఖైదీలను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.

జైలు అధికారులు జైళ్లలోకి, బయటికి వస్తుంటారన్న రేవంత్, వారి వల్ల ఖైదీలకు కరోనా సోకే ప్రమాదం లేకపోలేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.అందుకోసమే ఖైదీలను వెంటనే విడుదల ఆలోచన చేయాలని కోరారు.

ముఖ్యంగా, మహిళలు, వృద్ధుల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరుతూ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం నేపథ్యంలో పరిస్థితులను అర్థం చేసుకొని, సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు రేవంత్ రెడ్డి.

Telugu Congressrevanth, Kcr Ktr Farm, Revanth Reddy, Revanthreddy, Trs Kcr-Polit

రాష్ట్రంలో మొత్తం 5 లక్షల మంది ఖైదీలు ఉన్నారని, వారిలో 65 శాతం మంది ట్రయల్స్‌లో ఉన్నవారేనని పేర్కొన్నారు.శిక్ష కాలం ముగుస్తున్న వారిని, పెట్టీ కేసుల్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నవారిని విడుదల చేసే దిశగా చర్యలు తీసుకోవాలని తన లేఖలో రేవంత్ రెడ్డి కోరారు.రేవంత్ లేఖపై కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.ప్రస్తుతం తెలంగాణాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఇలా రాజకీయ వైరాలను పక్కన పెట్టి కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ, అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకుంటే అంతిమమంగా ప్రజలకు మేలు జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube