తెలంగాణ లో దుమ్ము రేపే దమ్ము రేవంత్ కే ఉందా ..? గుర్తించిన అధిష్టానం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు కొదవలేదు.ఎవరికి వారే గొప్ప నాయకులుగా చెప్పుకుంటూ … చెలామణి అవుతుతుంటారు.

 Revanth Reddy To Use Helicopter For Congress Election Campaign In Telangana-TeluguStop.com

ఇక పార్టీ అధికారంలోకి రాకుండానే… తామే సీఎం అభ్యర్థి అంటూ ప్రచారం కూడా చేసేసుకుంటూ ఉంటారు.ఎవరెన్ని లెక్కలు వేసుకున్నా అధిష్టానం దగ్గర ఎవరి సత్తా ఏంటో రిపోర్టుల రూపంలో చేరిపోతుంటాయి.

ఇక కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టి ఆ పార్టీ సిద్ధాంతాలను వంటపట్టించుకుంటున్న రేవంత్ ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తూ అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేస్తున్నాడు.అంతే కాదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పదవి కూడా కట్టబెట్టింది.

అయితే తెలంగాణాలో రేవంత్ కు ఇప్పటివరకు అక్కడ ఉన్న ఏ నేతకు లేనంత క్రేజ్ ఉండడం… ఆయన మీటింగ్ లకు… స్పీచ్ లకు వస్తున్న ఆదరణ చూసి ఆయన సేవలను విరివిగా వాడుకోవాలని నిర్ణయించింది.తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి అనుమతి ఇవ్వడమే కాదు.ఏకంగా.ప్రత్యేకంగా హెలికాఫ్టర్‌ను కేటాయించింది.కొడంగల్ లోని రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు.ఇక ఆయన ప్రతి రోజు అక్కడి నుంచే తెలంగాణాలో అనేక చోట్లకు ప్రచారం నిమిత్తం వెళ్తున్నారు.

ఆదిలాబాద్., ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల ఎన్నికల ప్రచారాన్ని హెలికాప్టర్ ద్వారా రేవంత్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.అంతే కాదు కాంగ్రెస్ లో తామే సీనియర్ నాయకులం అంటూ… సీఎం అభ్యర్థిని అనుకుంటున్నా నాయకుల ఇలాకాలో కూడా రేవంత్ ప్రచార షెడ్యూల్ లో ఉన్నాయి.ఇంకా విచిత్రం ఏంటి అంటే రేవంత్ ని ప్రచారానికి పంపించాల్సిందిగా సదరు సీనియర్ నాయకులే అధిష్టానానికి లేఖలు కూడా రాస్తున్నారట.

టీఆర్ఎస్ ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ .ఆయన కుమారుడు కేటీఆర్ ను ఇలా అందరిని తనదైన వ్యంగ్య బాణీలో ఓటర్లను ఆకట్టుకునేలా రేవంత్ మాటల తూటాలు వదలడం .దానికి స్పందన విపరీతంగా వస్తుండడం రేవంత్ కు డిమాండ్ పెరిగింది.ఇది గుర్తించే అధిష్ఠానం రేవంత్ కు హెలికాఫ్టర్ కేటాయించడంతో పాటు … తెలంగాణ లో ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరిగే అవకాశాన్ని కల్పించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube