జల దోపిడీలో వైఎస్ పాత్ర లేదు.. కానీ..!

తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ ముదురుతుంది.ఇరు రాష్ట్రాల నేతలు మాటలతో యుద్ధం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు.కృష్ణా జలాల దోపిడీకి కే.సి.ఆర్ కారణమని అన్నారు.నీళ్ల అంశాన్ని కే.సి.ఆర్ ఓటు బ్యాంక్ గా మార్చుకుంటున్నారని అన్నారు.తెలంగాణాలో కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టులు కలిపినా తమ రాస్ట్రానికి 1 టీ.ఎం.సీ నీటిని మాత్రమే వాడుకోగలమని.కానీ రోజుకి 11 టి.ఎం.సీల నీటిని తరలించే ప్లాన్ లో జగన్ ఉన్నారని విమర్శించారు.

 Revanth Reddy Targets Jagan In Krishna Water Disputes, Disputes, Jagan, Krishna, Revanth Reddy , Targets, Water-TeluguStop.com

రాయలసీమ ఎత్తిపొతల పథకం వెనక కే.సి.ఆర్ సూచనలు ఉన్నాయని అన్నారు రేవంత్ రెడ్డి.కే.సి.ఆర్ కనుసన్నల్లోనే ఈ పథకానికి రూపకల్పన జరిగిందని ఆయన అన్నారు.కృష్ణా జలాల దోపిడీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర ఏమి లేదని.

కానీ ఇప్పుడు జగన్ హస్తం ఉందని అన్నారు.తెలంగాణా కాంగ్రెస్ శ్రేణులను షర్మిల పార్టీ వైపు నడిచేందుకు కే.సి.ఆర్ డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు.ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే ఇలాంటి రాజకీయ నాయకులను బహిష్కరించాలని అన్నారు.నదీ జలాల విషయంలో లేనిపోని వివాదాలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

 Revanth Reddy Targets Jagan In Krishna Water Disputes, Disputes, Jagan, Krishna, Revanth Reddy , Targets, Water-జల దోపిడీలో వైఎస్ పాత్ర లేదు.. కానీ..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 టీపీసీసీ గా ఎన్నికైన దగ్గర నుండి రేవంత్ రెడ్డి కే.సి.ఆర్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube