సొంత పార్టీ నాయకులపై రేవంత్ యుద్దం ? మాటల దాడి వెనుక మర్మం ?  

Revanth Reddy Target Congress Party Leaders - Telugu Congress Party Leaders, Revanth Reddy Target, Trs Party, Uttam Kumar Reddy

ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీని ఆ పార్టీ కీలక నాయకులు కెసిఆర్, కేటీఆర్ ను టార్గెట్ చేసుకున్న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సొంత పార్టీ నాయకులు విమర్శలు మొదలు పెట్టినట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.ముఖ్యంగా కెసిఆర్, కేటీఆర్ అవినీతిపై పోరాటం చేస్తూ, పార్టీకి మైలేజ్ పెంచే విధంగా చేస్తున్నా, సొంత పార్టీ నాయకుల నుంచి తనకు కనీస మద్దతు లేకపోవడం పై రేవంత్ తీవ్ర అసహనంతో ఉన్నారు.

 Revanth Reddy Target Congress Party Leaders - Telugu Congress Party Leaders, Revanth Reddy Target, Trs Party, Uttam Kumar Reddy-Political-Telugu Tollywood Photo Image

తాజాగా రేవంత్ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడిన తీరును బట్టి రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలిపై ఎంత అసంతృప్తితో ఉన్నారు అనే విషయం అందరికీ అర్థమైంది.

అసలు తనకంటే ముందు కెసిఆర్, కేటీఆర్ అవినీతిపై పోరాటం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని, కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చేదని ఆయన చెప్పాడు.

సొంత పార్టీ నాయకులపై రేవంత్ యుద్దం మాటల దాడి వెనుక మర్మం - Revanth Reddy Target Congress Party Leaders - Telugu Congress Party Leaders, Revanth Reddy Target, Trs Party, Uttam Kumar Reddy-Political-Telugu Tollywood Photo Image

అంతేకాకుండా జైలులో ఉన్న తనను పరామర్శించేందుకు ఉత్తమ్ రాకపోవడంతో తోటి ఖైదీలు కూడా తనను ప్రశ్నించారని రేవంత్ చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే తెలంగాణలో కాంగ్రెస్ బల పడలేక పోతుందని, అదే టిఆర్ఎస్ కు వరంగా మారింది అని చెప్పుకొచ్చారు.

కెసిఆర్ అవినీతిపై పోరాటంలో భాగంగా భూ లావాదేవీలకు సంబంధించి కార్యాచరణ బాధ్యతను తనకు, సాగునీటి రంగంలో దోపిడీపై బాధ్యతలను ఉత్తంకుమార్ రెడ్డి కి కుంతియా అప్పగించారు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా టిఆర్ఎస్ నాయకులపై తన పోరాటం ఆపేది లేదని, ఇక నుంచి టిఆర్ఎస్ దోపిడీకి సంబంధించిన అన్ని వివరాలను కాగితాల రూపంలో లెక్కలతో సహా వివరిస్తాను అని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ పార్టీ కరోనా అయితే టిఆర్ఎస్ పార్టీ ఎయిడ్స్ లాంటి పార్టీ అని రేవంత్ ఎద్దేవా చేశారు.మొత్తంగా రేవంత్ మాటలను బట్టి చూస్తే తాను టీఆర్ఎస్ పార్టీపై ఇన్ని ఇబ్బందులు పడుతూ ఇన్ని పోరాటాలు చేస్తున్నా, కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, మిగతా సీనియర్ నాయకులు గానీ స్పందించక పోవడంపై తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఉన్నట్లు గా కనిపిస్తోంది.

మరి రేవంత్ వ్యాఖ్యలకు సీనియర్లు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

తాజా వార్తలు

Revanth Reddy Target Congress Party Leaders Related Telugu News,Photos/Pics,Images..