తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరుపొందిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొద్దిరోజులుగా ఆ పార్టీ నేతలపై అసంతృప్తిగా ఉన్నారు.హుజూర్ నగర్ ఉప ఎన్నికల సందర్భంగా అభ్యర్థి విషయంలో ఏర్పడిన మనస్పర్ధలు కారణంగా ఆయన దూరం దూరం గా ఉంటున్నారు.
అయితే ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకం.ఈ ఎన్నికల్లో కనుక పార్టీ ఓడిపోతే మరింత దయనీయ పరిస్థితి వెళ్లిపోతుంది.
అందుకే కాంగ్రెస్ అధిష్టానం నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు అంతా తమ శక్తికి మించి కష్టపడుతున్నారు.ఈ ఉప ఎన్నిక కోసం చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ నేతలు, రాష్ట్రస్థాయి నాయకులు ప్రచారానికి వెళుతూ గట్టిగా కష్టపడుతున్నారు.
కానీ యూత్ లో మంచి క్రేజ్ ఉన్న రేవంత్ మాత్రం అటువైపుగా వెళ్లేందుకు ఇష్టపడడం లేదు.దీన్ని బట్టి చూస్తే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

హుజూర్ నగర్ లో టీ పిసిసి అధ్యక్షుడు కుమార్ రెడ్డి తన భార్యను అభ్యర్ధిగా ప్రకటించగా రేవంత్ రెడ్డి మాత్రం చామల కిరణ్ రెడ్డి కి టికెట్ ఇప్పించాలని చూశారు కానీ ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులంతా రేవంత్ మీద కోపంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మద్దతుగా నిలబడ్డారు.మరోవైపు చూస్తే ఈ ఉప ఎన్నిక కోసం టిఆర్ఎస్ బిజెపి గట్టిగా ప్రచారానికి దిగుతున్నాయి.మండలానికి ఒక ఇంఛార్జిని నియమించి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.టిఆర్ఎస్ పార్టీ అయితే స్థానికంగా బలంగా ఉన్న సిపిఎంతో పొత్తు పెట్టుకుంది.వారు కూడా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని ప్రకటించారు.దీంతో అప్పుడే ఆ పార్టీలో గెలుపు ధీమా వచ్చేసినట్టు కనిపిస్తోంది.
ఇక బిజెపి అయితే కేంద్ర మంత్రులను ప్రచారానికి దించి గెలుపు కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.ఇక్కడ తమ అభ్యర్థి గెలవకపోయినా ఫర్వాలేదు కానీ ఇక్కడ రెండో స్థానాన్ని అయినా దక్కించుకోవాలన్నట్టుగా బీజేపీ చూస్తోంది.

అయితే కాంగ్రెస్ లో మాత్రం ఎక్కడా ఆ హుషారు మాత్రం కనిపించడంలేదు.నాయకుల మధ్య ఏర్పడిన మనస్పర్థలు కారణంగా అయోమయ పరిస్థితి నెలకొంది.ఎవరికి వారు గ్రూపు రాజకీయాలతో పార్టీకి నష్టం చేస్తున్నారు.ప్రస్తుతం ఉప ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించే బాధ్యత టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కు ఎంత ఉందో అంతే బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఉంది.
అయినా ఆయన మాత్రం ప్రచారానికి వచ్చేందుకు ఇష్టపడడం లేదు.ఇక ముందు ముందు కూడా రేవంత్ ప్రచారానికి వస్తారనే నమ్మకం కూడా లేదు.ఇక మరో వైపు చూస్తే మహిళ ఫైర్ బ్రాండ్ నాయకురాలు పేరు విజయశాంతి కూడా ప్రచారానికి దూరంగానే ఉండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.ఈ పరిణామాలన్నిటిని చూస్తే గ్రూపు తగాదాలతో కాంగ్రెస్ పార్టీ తన కన్నుని తానే పొడుచుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.