ట్విట్టర్ లో కేసీఆర్ ని ఉతికి ఆరేస్తున్న రేవంత్ రెడ్డి   Revanth Reddy Shocking Tweet On KCR     2018-01-04   22:37:42  IST  Bhanu C

తెలంగాణా ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని…కాంగ్రెస్ తన పార్టీలోకి తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఒక్కటే అది ఏంటంటే వెయ్యి మంది ఒక్కసారిగా మాటలతో దాడి చేస్తే తానూ ఒక్కడు నిలబడి అందరికీ సమాధానం చెప్పగలడు. అది రేవంత్ సత్తా..అందుకే బీజేపి సైతం రేవంత్ తో దోస్తీకి సై అంది. అయితే తెలంగాణలో ఈ మధ్య రాజకీయ నాయకులు అందరూ తమ తమ రాజకీయాల ప్రయోజనాలకోసం ట్విట్టర్ ని వేదికగా చేసుకుని ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు…అయితే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉందని రేవంత్ రెడ్డి ఇప్పుడు అందరి రాజకీయ నాయకుల బాటలో నడుస్తున్నారు..

ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి తెలంగాణ సిఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు..కేసీఆర్ ఎందుకు పనికి రాడు అని అన్నారు..ట్విట్టర్ వేదికగా ఈ మాటల యుద్ధం జరిగింది..కేసీఆర్ ని , తెలంగాణా ప్రభుత్వ అధికార గణాన్ని ట్విట్టర్ సాక్షిగా ఏకేశాడు రేవంత్..సీఎం సొత జిల్లా ఏంటో కూడా తెలియనటువంటి అధికారులు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు అంటే ఇంతకంటే దిక్కుమాలిన పరిస్థితి ఏమన్నా ఉంటుందా అంటూ ఫైర్ అయ్యారు..అసలు రేవంత్ ఎందుకు ఈ కామెంట్స్ చేశారని చుస్తే..అధికారులు గుడ్డిగా చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.

రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గ‌జ్వేల్‌లోని 50 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిని 100 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిగా మార్చ‌డంతోపాటు దానిని ఏరియా హాస్పటల్ గా అప్‌గ్రేడ్ చేస్తూ ఈనెల 3వ తేదీన జీవో ఆర్‌.టి. నెంబ‌ర్ 5ను జారీ చేసింది..ఆ జీవో లో ఒక‌చోట గ‌జ్వేల్ మెద‌క్ జిల్లాకు చెందిందిగా పేర్కొంటూ మిగిలిన చోట గ‌జ్వేల్ నే జిల్లాగా పేర్కొంటూ ఆ జీవోలో తెలిపారు అయితే ఆ జీవోని పరిశీలిస్తే కలెక్టర్ గజ్వేల్ జిల్లా హాస్పిటల్ కో ఆర్డినేటర్ ,గజ్వేల్ జిల్లా అధికారికి పంపుతున్నట్టుగా తెలిపారు అయితే ఎంతో ముఖ్యమైన ఆ జీవోలని తమకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే తరువాత జరిగే పరిణామాలకి ఎవరు భాద్యత వహిస్తారు అంటూ ట్వీట్ చేశారు..

ఇదిలా ఉంటే రేవంత్ ట్వీట్ చుసిన వెంటనే అధికారులు హుటా హుటిన జీవో నో మార్పులు చేశారని..ఆ ప్లేస్ లో కొత్త జీవో ని పెట్టారని తెలిపారు..అయితే రెండవ సారి కూడా ఆ సవరణలో తప్పులు దొర్లాయి..అధికారులు, ప్రభుత్వం ఇలానే ఉంటే ఇక రాష్ట్రంలో ప్రజలకి ఏ రకంగా సేవ చేస్తారు..సమస్యలు పరిష్కరిస్తారు..కేసీఆర్ లాంటి వ్యక్తి సీఎం కావడం మాన దురదృష్టం..రాష్ట్రంలో ప్రస్తతం తుగ్లక్ పాలన నడుస్తోంది అని ట్వీట్ చేశారు.