ప్రధాని మోడీ పర్యటనపై రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్..!!

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి పురస్కారాలకు ప్రధాని మోడీ జులై 4వ తారీఖున ఏపీ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.పర్యటనలో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహం ఆవిష్కరణ.

 Revanth Reddy Serious Comments On Modi Telangana Tour Revanth Reddy , Modi , Telangana Tour, Vishakapatnam, Bjp, Ts Congress-TeluguStop.com

అదేవిధంగా విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నారు.ఇదిలా ఉంటే ఈ పర్యటనకు ముందు అనగా జూలై 2, 3 తారీకులలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ మోడీ హాజరుకానున్నారు.

తెలంగాణ రాష్ట్రం పై పట్టు సాధించే దిశగా బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల కు ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఇంకా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

 Revanth Reddy Serious Comments On Modi Telangana Tour Revanth Reddy , Modi , Telangana Tour, Vishakapatnam, Bjp, Ts Congress-ప్రధాని మోడీ పర్యటనపై రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది సంవత్సరాలు పాటు చిల్లి గవ్వ ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకొని.రాష్ట్రానికి మోడీ వస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు.తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోడీ బీజేపీ  నాయకులు అన్యాయం చేశారని క్షమాపణలు తెలియజేయాలని డిమాండ్ చేశారు.ఇంకా నిధులు, పదవుల విషయంలో కేంద్రంలో దక్షిణాదికి ప్రాధాన్యం లేదని ఆరోపించారు.

ఇక ఇదే సమయంలో రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కలవటానికి తమ పార్టీ నేతలు సిద్ధంగా లేరని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube