ఖైరతాబాద్ రోడ్ షోలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు..!!

Revanth Reddy Serious Comments On BRS Govt In Khairatabad Road Show Revanth Reddy, Congress, BRS

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.ప్రచారంలో భాగంగా అధికార పార్టీ బీఆర్ఎస్ నీ టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

తెలంగాణలో మూడోసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పోటీ బీఆర్ఎస్.కాంగ్రెస్ పార్టీల మధ్య ఉందని సర్వేలలో ఫలితాలు వస్తున్నాయి.

దీంతో రేవంత్ రెడ్డి ఎక్కువగా కేసీఆర్ పార్టీని టార్గెట్ చేసుకుని… ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.తాజాగా రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ రోడ్ షోలో పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో అనేక నష్టాలు ఏర్పడ్డాయని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రంలో బడికి వెళ్లే పిల్లలు కేసీఆర్ ని చూసి తాగడానికి అలవాటు పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ మార్చాలంటూ విమర్శల వర్షం కురిపించారు.ఇదే సమయంలో శాసనసభకు వెళ్లే ఆడవారి సంఖ్య చాలా తగ్గింది అంటూ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.

తెలంగాణలో ప్రభుత్వం మారాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని రేవంత్ రెడ్డి ప్రచారంలో కోరారు.

ఖైరతాబాద్ కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ రెడ్డితో పాటు.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొనడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube