రకుల్ రాణా అంటూ కేటీఆర్ పై రేవంత్ సంచలన విమర్శలు 

టాలీవుడ్ డ్రగ్స్ కేసుల వ్యవహారం తిరిగి తిరిగి రాజకీయ రంగు పులుముకుంది.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య వ్యవహారం లో పెద్ద ఎత్తున సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటుచేసుకుంటున్నాయి.

 Revanth Reddy Sensational Comments On Ktr-TeluguStop.com

తాజాగా కేటీఆర్ నుంచి రేవంత్ రెడ్డి అనేక ప్రశ్నలు సంధించారు.మంత్రి కేటీఆర్ విసిరిన సవాలును స్వీకరించి  సోమవారం అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కేటీఆర్ కు అనేక ప్రశ్నలు సంధించారు.

ఎక్సైజ్ శాఖ విచారణ నివేదికను ఎందుకు ఈడికి ఇవ్వడం లేదు ? ఐపీఎస్ అధికారి కమిటీ ఏమైంది అంటూ రేవంత్ ప్రశ్నించారు.అకూన్ సబర్వాల్ కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.

 Revanth Reddy Sensational Comments On Ktr-రకుల్ రాణా అంటూ కేటీఆర్ పై రేవంత్ సంచలన విమర్శలు -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

డ్రగ్స్ కేసు విచారణ లో ఉండగానే అకూన్ సభర్వాల్ ను  తప్పించారు.బంజారా హిల్స్, మాదాపూర్ ,కొండాపూర్ వరకు పబ్ లు వ్యాప్తి చెందాయి.

విదేశాల నుంచి వచ్చిన డ్రగ్స్, గంజాయి వాడకం ఎక్కువైంది.కేటీఆర్ కు బాధ్యత లేదా ? పిల్లలు డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా ? కేటీఆర్ ఎదురుదాడి చేస్తున్నారు.అంటూ రేవంత్ కేటీఆర్ ను ఉద్దేశించి తీవ్రంగా మండిపడ్డారు.

        ఎవరు నేరగాళ్లు అనే చర్చ తర్వాత చేద్దాం.

అమరవీరుల స్తూపం ముందు మేము రెడీగా ఉన్నాం.మా తండ్రి ,తాత ,ముత్తాత చరిత్ర కూడా చర్చిద్దాం.

డ్రగ్స్ కేసు చర్చ పక్కదారి పట్టించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారు.మీ ఆస్తులు అడగడం లేదు.
     

రానా, రకుల్ ప్రీత్ సింగ్ ని ఈడి పిలిచింది.వాళ్లను నేను అంటుంటే కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు.కేసులు వేస్తానని బెదిరిస్తున్నారు.కేటీఆర్ నీ స్థాయి పెద్దది అనుకుంటున్నావ్.  నువ్వు ఎమ్మెల్యే కాకముందు నేను ఎమ్మెల్సీ అయ్యాను.నువ్వు మొదటిసారి ఎమ్మెల్యేగా కేవలం 100 ఓట్లతోనే గెలిచావు.

రాజకీయ పరంగా చూస్తే కేటీఆర్ నువ్వు నా వెంట్రుకతో సమానం.డ్రగ్స్ టెస్ట్ కు రా అని నేను అడిగానా ? నువ్వు అడిగావా ? నువ్వు విసిరిన సవాల్ అని నేను స్వీకరించా.మరో ఇద్దరికీ సవాల్ విసిరా.గన్ పార్క్ కి అరగంట ముందే కేటీఆర్ కు వస్తారు అనుకున్నా.రాహుల్ గాంధీని రమ్మని చెప్పిన కేటీఆర్ .ఇవాంకా ట్రంప్ ని కూడా రమ్మని అడుగుతారేమో.
       

డ్రగ్స్ తో నీకు సంబంధం ఉందని అన్నా మా ? నువ్వే డ్రగ్ టెస్ట్ కు సిద్ధమేనని సవాల్ చేసావు.కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ సవాల్ నేను స్వీకరించక పోతే, జనానికి అనుమానం వస్తుంది ఆయన చెప్పిన మాటలకు నేను వైట్ చాలెంజ్ అని విసిరా.కేటీఆర్ ని కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే కేటీఆర్ స్లీపింగ్ ప్రెసిడెంట్ గా మారిపోయాడు ‘ అంటూ రేవంత్ తీవ్రస్థాయిలో కేటీఆర్ పై విమర్శలు చేశారు.

#Revanth Reddy #Telangana #Rakul Preeth #PCC #Congress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు