కేసీఆర్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి..   Revanth Reddy Sensational Comments On KCR     2018-11-15   12:50:23  IST  Surya

తెలంగాణా రాజకీయాల్లో కేసీఆర్ లాంటి వాగ్ధాటి ఉన్న నేతని ఎరుకోవాలి అంటే కేవలం ఒకే ఒక్క నాయకుడి వల్ల సాధ్యం అవుతుంది ఆయనే రేవంత్ రెడ్డి తన మాటలతో కేసీఆర్ కి హై బీపీ తెప్పించగల ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు తాజాగా రేవంత్ చేసిన విమర్శలు కేసీఆర్ కి టెన్షన్ పెట్టిస్తున్నాయి.ఎన్నికలు ముంగిట్లో ఉన్న సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో పెద్ద సంచలనం అవుతున్నాయి ఇంతకీ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఏమిటి..???

రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కేసీఆర్ కి షాక్ ఇచ్చేలా టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అంటూ ప్రకటించాడు….బుధవారం కోడంగల్ లో నిర్వహించిన సమావేశంలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు దాంతో ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు..ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ఎన్నికల ముందు ఆ పార్టీకి పెద్ద దెబ్బేఅంటూ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు..అయితే ఇప్పుడు రేవంత్ చేసిన వ్యఖ్యలపైనే అందరి దృష్టి పడింది, తీవ్ర చర్చకి దారితీసింది.

రేవంత్ ఈ వ్యాఖ్యల సందర్భంగా మాట్లాడుతూ నన్ను ఓడించేందుకు పట్నం బ్రదర్స్‌ను పంపించడం కాదు. దమ్ముంటే కేసీఆరే రా.. కొడంగల్‌ చౌరస్తాలో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు..వైఎస్సార్‌కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం, ఒవైసీకి హైదరాబాద్‌ ఎలాగో రేవంత్‌ రెడ్డికి కొడంగల్‌ కార్యకర్తలు అలా అండగా నిలుస్తారని చెప్పారు…అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే..

Revanth Reddy Sensational Comments On KCR-Electons In Telangana KCR Mahakutami TRS

తాండూరులో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విలేఖరులు రేవంత్ చెప్పిన ఎంపీల లిస్టు లో మీరు ఉన్నారా అనగానే ఇద్దరు కాదు ముగ్గురు అంటూ వెళ్ళిపోయారు…దాంతో రేవంత్ వ్యాఖ్యలకి మరింత ఊతం దొరికినట్టయ్యింది. మరి కేసీఆర్ కి రేవంత్ ఎప్పుడు ఎలాంటి సమయంలో ఎక్కడ షాక్ ఇస్తారో తెలియదు కాని మొత్తానికి ఇద్దరు ఎంపీలు జంప్ చేయడం పక్కా అనడంతో టీఆర్ఎస్ లో అంతర్మధనం మొదలయ్యింది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.