కొత్త పార్టీ ఏర్పాటుకు రేవంత్ యోచన...అసలు వ్యూహం ఇదే

తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి ఫైర్ బ్రాండ్ గా పేరుంది.తాను ఉన్న పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా రాష్ట్రమంతా తనకు అభిమానులు ఉన్నారు.

 Revanth Reddy Plan To Form A New Party This Is The Real Strategy-TeluguStop.com

ఎందుకంటే కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేస్తూ ఒంటరిగా రాజకీయ చాణక్యూడైన కేసీఆర్ ను ఢీ కొట్టడమంటే ఆశామాషీ వ్యవహారం కాదు.అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ఒంటి చేత్తో నడిపిస్తున్న పరిస్థితి ఉంది.

అంతర్గత కుమ్ములాటలకే సమయం కేటాయిస్తూ ప్రజల సమస్యలపై గట్టిగా పోరాటం చేయడంలో విఫలమవుతుండడంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పలుచనయి పోయింది.అయితే ఒక్కడిగా కాంగ్రెస్ పటిష్టత కోసం పోరాడుతున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ఎందుకంటే తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసే పనిలో షర్మిల నిమగ్నమై ఉన్న విషయం తెలిసిందే.అయితే షర్మిల ఎంట్రీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎసరు తెస్తా ఉంది.

ఎందుకంటే రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం మద్దతు గల వ్యక్తి కాబట్టి షర్మిల కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి షర్మిల వైపు రెడ్డి సామాజిక వర్గం కీలక నేతలు వెళ్తే రేవంత్ రెడ్డి ఒక్కడు తప్ప వేరెవరు మిగిలే అవకాశం లేదు.అందుకే తనకు ఇబ్బంది కాకుండా ఉండేందుకే కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని కూడా తన సన్నిహితులు సూచిస్తున్నట్టు తెలుస్తోంది.

మరి రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube