తెలంగాణ పీసీసీ చీఫ్ గా అతని వైపే చూస్తున్న అధిష్టానం  

టీపీసీసీ ప్రెసిడెంట్ బాద్యతలు రేవంత్ రెడ్డికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం..

Revanth Reddy Next Pcc Chief In Telangana-pcc Chief In Telangana,revanth Reddy,telangana Politics,trs Party,trs Telangana Politics Trs Kec Ktr Pavan Kalyan Wishes Letter Leaders

జాతీయ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకి మరీ తీసికట్టుగా తయారవుతుంది. ఆ పార్టీని ముందుండి నడిపించే నాయకుడే లేకుండా పోయాడు. ఇప్పటికే ఏపీలో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని చాలా కష్టంగా మోసుకొచ్చిన రఘువీరా రెడ్డి ఇక తన వలన కాదని వదిలేసాడు..

తెలంగాణ పీసీసీ చీఫ్ గా అతని వైపే చూస్తున్న అధిష్టానం-Revanth Reddy Next PCC Chief In Telangana

దీంతో ఏపీలో ఇప్పుడు ఆ పార్టీని మోసే నాధుడు ఎవరో ఆ పార్టీకి అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పరిస్థితి కొంతలో కొంత బెటర్ అని చెప్పాలి. ఏపీలో మాదిరి మరీ ప్రజలు పట్టించుకోలేని స్థితిలో అయితే లేదు.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఉత్తమ్ కుమార్ రెడ్డి నడిపిస్తున్నారు. అయితే ఆయన నాయకత్వ లక్షణాలు అంతంత మాత్రంగానే ఉండటంగా పార్టీ నేతలని ఒక తాటిపైకి తీసుకురావడంలో పూర్తిగా విఫలం అయ్యారు. దీంతో పార్టీ తరుపున గెలిచినా ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిపోయారు.

ఈ నేపధ్యంలో పార్టీ ప్రక్షాళన చేసిన సరైన నాయకత్వం చేతిలో పెట్టి తెలంగాణలో పార్టీ భవిష్యత్తు కాపాడుకోవాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ అదిస్తాం యోచిస్తుంది. దాని కోసం ఇప్పుడు పార్టీ మొత్తం రేవంత్ రెడ్డి వైపు చూస్తుంది. అతను మాత్రమే పార్టీని తెలంగాణలో బలంగా నడిపించగలడు అని విశ్వసిస్తుంది.

ఈ నేపధ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డిని తెర ముందుకి తీసుకొచ్చే పనిలో ఉంది. మరి ఇంత వరకు ఆ పార్టీకి తెలంగాణలో పునరుత్తేజం ఇస్తుంది అనేది వేచి చూడాలి