ఆ విషయంలోనూ రేవంత్ దూకుడు ? కేసీఆర్ కు ఇబ్బందే ?

టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా, ఏ విషయంపైన అయినా పోరాడాలి అంటే అందరికంటే ముందు వరుసలో ఉంటారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ వ్యవహారంలో ఆయన దూకుడుగా వ్యవహరించి టిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలను అభాసుపాలు చేయడంలో సక్సెస్ అయ్యారు.

 Congress Party Working President Rewanth Filed The Petition In National Green Tr-TeluguStop.com

అలాగే కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ వ్యవహారంలోనూ కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా నిషేదిత ప్రాంతంలో ఫామ్ హౌస్ నిర్మించారు అంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను కూడా ఆశ్రయించి కలకలం రేపారు.ఈ వ్యవహారంలో రాజకీయంగాను, వ్యక్తిగతంగానూ కేసీఆర్, కేటీఆర్ చాలానే నష్టపోయారు.

ఇక ఆ తరువాత ఈ వ్యవహారంపై వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది.ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతను అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి మరోసారి రంగంలోకి దిగి, ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు.

Telugu Congressmlc, Kcr Ktr Farm, Revanth Reddy, Telangana-

ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ కూడా దాఖలు చేశారు.సెక్రెటరియేట్ కూల్చివేతతో పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందని, వెంటనే కూల్చివేతను నిలిపివేసేవిధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.కూల్చివేతల విషయంలో ఎటువంటి అనుమతి తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదని, తెలంగాణ సెక్రటేరియట్ హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉందని రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు.కూల్చివేతలు కారణంగా వస్తున్న వ్యర్థాల వల్ల హుస్సేన్సగర్ కాలుష్యం బారిన పడుతుందని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం సెక్రటరియేట్ కూల్చివేతపై 15వ తేదీ వరకు హైకోర్టు స్టే ఉంది.గతంలోనే ఈ కూల్చివేతపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

అక్కడ కూడా విచారణ జరగాల్సి ఉంది.

Telugu Congressmlc, Kcr Ktr Farm, Revanth Reddy, Telangana-

సెక్రటేరియట్ కూల్చివేత సగంలోనే ఆగిపోతే, శిధిలాలు అలాగే ఉండిపోతాయి ఇది ప్రభుత్వానికి మరింత ఇబ్బంది తెచ్చిపెడుతోంది.అందుకే ఏదో ఒక రకంగా ఈ విషయంలో పై చేయి సాధించి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోంది.ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదని, ప్రభుత్వంపై పై చేయి సాధించాలని రేవంత్ ముందుకు వెళుతున్నట్లు కన్పిస్తోంది.

సెక్రటేరియట్ కూల్చివేత విషయంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ప్రభుత్వానికి ఇబ్బందులు తీసుకురావాలనే విధంగా ప్రస్తుతం కాంగ్రెస్ ముందుకు వెళుతుంది.అయితే ఈ విషయంలో బిజెపి పెద్దగా స్పందించక పోవడంపై కాంగ్రెస్ గుర్రుగా ఉంది.

ఇప్పటికే బిజెపి టిఆర్ఎస్ ఈ విషయంలో కుమ్మక్కయ్యాయి అంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు.రేవంత్ దూకుడుకు కళ్లెం వేసి కేసీఆర్ ఈ విషయంలో ఏ విధంగా పైచేయి సాధిస్తారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube