ఏంటి రేవంత్ ఈ దూకుడు ? భయం లేదా బ్రేకుల్లేవా ?

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, అధికార టీఆర్ఎస్ పార్టీ పైన, నిప్పులు చెరుగుతూ, రోజు రోజుకి బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే వస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.టిఆర్ఎస్ పార్టీకి ఎదురే లేకుండా పరిస్థితులు ఉన్నా, రేవంత్ ను చూసి బాగా భయపడుతున్నట్లు గానే వ్యవహారం కనిపిస్తోంది.

 Congress Working President Revanth Reddy Fight  Against Trs Govt,revanth Reddy,-TeluguStop.com

ఎందుకంటే రేవంత్ టిఆర్ఎస్ విషయంలో ఎక్కడా రాజీ లేకుండా పోరాటం చేస్తూ వస్తున్నారు.తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మొదటి నుంచే ఆయన టీఆర్ఎస్ పై ఈ స్థాయిలో దూకుడుని కనబరుస్తూ వస్తున్నారు.

అడుగడుగున కేసీఆర్, కేటీఆర్ కు సంబంధించిన వ్యవహారాల పైన, టిఆర్ఎస్ ప్రభుత్వం పైనా, పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ , రేవంత్ తెలంగాణ రాజకీయాల్లో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తూ వస్తుండడం టిఆర్ఎస్ అగ్ర నాయకులకు సైతం మింగుడు పడని అంశంగా మారింది.

అందుకే ఎక్కడికక్కడ రేవంత్ దూకుడును అడ్డుకునేందుకు ఆయనపై కేసులను నమోదు చేస్తూ, ఆయన అనుచరులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నా, రేవంత్ మాత్రం తన విధానం మార్చుకోకుండా, టిఆర్ఎస్ పై రాజీ లేని పోరాటం చేస్తూనే వస్తున్నారు.

ఈ సందర్భంగా సొంత పార్టీ నాయకుల నుంచి తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవుతున్న రేవంత్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.కాంగ్రెస్ పార్టీలో చేరిన అనతికాలంలోనే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కించుకున్న రేవంత్, ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవి పైన కన్నేశారు.

ఆ పదవిని దక్కించుకునేందుకు, అధిష్టానం దృష్టిలో పడేందుకు టిఆర్ఎస్ పై రాజీలేని పోరాటం చేస్తూ వస్తున్నారు.

Telugu Congress, Congressrevanth, Revanth Reddy, Telangana-Telugu Political News

ఇదే సొంత పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు.అసలే కాంగ్రెస్ పార్టీ అంటే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు.ఇక్కడ ఎవరికి వారే.

అందరికంటే తామే గొప్ప అనే అభిప్రాయంలో ఉంటూ ఉంటారు.ఇప్పుడు రేవంత్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సీనియర్లంతా ఏకతాటి పైకి వచ్చి అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు.

అయినా అధిష్టానం పెద్దలు కాంగ్రెస్ కు తిరిగి పునర్వైభవం తీసుకురాగలిగిన నాయకుడు కేవలం రేవంత్ మాత్రమేనని నమ్ముతూ ఉండడంతో, ఆయనకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్టుగా సంకేతాలు ఇస్తూ ఉండడం వంటి పరిణామాలు రేవంత్ కు ఆయన అనుచరులకు మరింత ఉత్సాహం కలిగిస్తున్నాయి.

టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎప్పుడు, ఎక్కడ గొంతు ఎత్తాలన్నా, రేవంత్ ముందు వరుసలో ఉంటూ వస్తున్నారు.

కేటీఆర్, కేసీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ, జనాల్లో వారి పరపతి తగ్గించే విషయంలో రేవంత్ సక్సెస్ అవుతూ వస్తున్నారు.ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా రేవంత్ వల్ల తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో కెసిఆర్, కేటీఆర్ నిత్యం ఆయన దూకుడును తగ్గించే విధంగా ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా, రేవంత్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.

ఈ విషయంలో పార్టీ నాయకులు మద్దతు లేకపోయినా, ఒంటరిగానే రేవంత్ పోరాడుతున్న తీరు నిజంగా సాహసమనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube