కొడంగ‌ల్‌కు రేవంత్‌రెడ్డి గుడ్ బై..!

తెలంగాణ‌లో జిల్లాల‌ పున‌ర్విభ‌జ‌నతో కీల‌క నాయ‌కుల నియోజక‌వ‌ర్గాల్లో అనేక మార్పులు జ‌రిగిపోయాయి.దీంతో చాలా మంది నాయ‌కులు కొత్త నియోజ‌క‌వ‌ర్గాల‌ను వెతుక్కునే ప‌నిలో ప‌డ్డారు.2019 ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల టైం మాత్ర‌మే ఉంది.ఈ లోగానే ఎవ‌రికి వారు తాము పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాల వేట‌లో ప‌డ్డారు.

 Revanth Reddy Goodbye To Kodangal-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే టీటీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి సైతం తాను బ‌రిలో దిగేందుకు కొత్త నియోజ‌క‌వ‌ర్గం వేట‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

రేవంత్ ప్ర‌స్తుతం ప్రాధినిత్యం వ‌హిస్తోన్న కొడంగ‌ల్ జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌లో ముక్క‌లు చెక్క‌లైంది.

ప్ర‌స్తుతం కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని మండ‌లాలు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – నాగ‌ర్‌క‌ర్నూలు – వికారాబాద్ జిల్లాల్లోకి వెళ్లిపోయాయి.దీంతో కొడంగ‌ల్‌లో టీఆర్ఎస్ ప‌ట్టు బాగా పెరిగింది.దీంతో రేవంత్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొడంగ‌ల్‌కు గుడ్ బై చెప్ప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే క‌ల్వ‌కుర్తి లేదా నారాయ‌ణ్‌పేట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి రేవంత్ పోటీ చేస్తార‌ని తెలుస్తోంది.

నాగ‌ర్‌క‌ర్నూల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న క‌ల్వ‌కుర్తిలో టీడీపీకి మంచి ప‌ట్టు ఉంది.గ‌తంలో ఓసారి టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు ఎన్టీఆర్ ఇక్క‌డి నుంచి పోటీ చేసి ఓడిపోయారు కూడా.అయినా పార్టీకి సంస్థాగ‌తంగా బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది.ఇక్క‌డ నుంచి ప్ర‌స్తుతం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీచంద‌ర్‌రెడ్డి ప్రాధినిత్యం వ‌హిస్తున్నారు.

బ‌ల‌మైన అపోజిష‌న్ అంటూ ఎవ్వ‌రూ లేక‌పోవ‌డంతో రేవంత్ క‌న్ను క‌ల్వ‌కుర్తిపై ప‌డ‌డానికి కార‌ణంగా క‌నిపిస్తోంది.

ఇక క‌ల్వ‌కుర్తి కాక‌పోతే మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని నారాయ‌ణ్‌పేట్ నుంచి కూడా పోటీచేయాల‌నే అంశంపై యోచిస్తున్నార‌ట‌.

ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచిన రాజేంద‌ర్‌నాథ్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు.ఇక్క‌డ కూడా పార్టీ బ‌లంగా ఉంది.

దీంతో 2019లో రేవంత్ క‌న్ను క‌ల్వ‌కుర్తి లేదా నారాయ‌ణ్‌పేట్‌పైనే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube