పదవి ఇచ్చినా ఇవ్వకున్నా రేవంత్ ప్లాన్ ఇది

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ నేతల్లో తీవ్రమైన పోటీ నెలకొన్నది.కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి రెండు వర్గాలుగా చిలీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

 Revanth Reddy Go To Rajashekar Reddy Root In Padayatra,rajashekar Reddy,tpcc,rev-TeluguStop.com

ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ పోటీ నుండి తప్పుకుంటునట్లుగా ఆయన మాటలను బట్టి చూస్తే అర్థం అవ్వుతుంది.తనకు టీపీసీసీ చీఫ్ పదవి ముఖ్యం కాదని  రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ పదవి  నప్పుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.

ఒకవేళ అధిష్టానం టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తే తప్పకుండ స్వీకరిస్తాను అన్నాడు.ఆ పదవి తలకు మించిన భారం అవ్వుతుందని గుర్తుచేశాడు.

సీనియర్ నాయకుల నుండి చిన్న చితకా నాయకుల వరకు అందరిని సమన్వయ పరుచుకుంటు పోవాలని రేవంత్ అన్నాడు.ప్రచార కమిటీ చైర్మెన్ పదవి అయితే ప్రజలతో మమేకమై పోవచ్చు అంటున్నాడు.

రేవంత్ కు ఉన్న దూకుడు స్వభావం అందరికి తెలిసిందే అధికార పార్టీ పై విమర్శలు చెయ్యడంలో దిట్ట.రేవంత్ పార్టీ ప్రచారం కమిటీగా ఉంటూనే సి‌ఎం కూర్చిపై కన్ను వేసినట్లుగా తెలుస్తుంది.2004, 2009 ఎన్నికల్లో వై‌ఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ గా ఉండి పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరై ఎం‌ఎల్‌ఏల మదత్తుతో ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యాడు.అప్పుడు డి శ్రీనివాస్ పీసీసీ చీఫ్ గా ఉన్నాడు.

రేవంత్ రెడ్డి కూడా రాజశేఖర్ రెడ్డి రూట్ లోనే వెల్లుతున్నట్లుగా తెలుస్తుంది.పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గర కావాలని రేవంత్ చూస్తున్నాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube