కేసీఆర్,తలసానికి తలంటిన..రేవంత్ రెడ్డి   Revanth Reddy Fire On KCR,Talasani     2017-12-08   01:03:21  IST  Bhanu C

తలసాని మొన్నటికి మొన్న రేవంత్ ని టార్గెట్ చేస్తూ నువ్వొక బచ్చా నీ పీక పిసుకుంతా అన్న కామెంట్స్ అందరికీ తెలిసిందే..అయితే ఈ విషయంలో కొంచం లేటుగా రేవంత్ స్పదించినా సరే చాలా ఘాటుగానే స్పందించారు.రేవంత్ అన్న మాటలు వింటుంటే మరొకరు అయితే ఏమి చేసుకునే వారో అన్నట్టుగా ఉన్నాయి ఆ కామెంట్స్.

రేవంత్ కి సహజంగానే మాటల తూటాలు పేల్చడంలో సిద్ద హస్తుడు..ఒకింత కోపం వచ్చి మాట్లాడితే మాత్రం..ఆ నోటికి కళ్ళెం వేయడం మాత్రం ఎవరి వల్లా సాధ్యం కాదు.గురువారం రేవంత్ వికారాబాద్ జిల్లాలో మాట్లాడుతూ ఓ గొర్రెల మంత్రి తలసాని నువ్వు నాపీక పిసుకుతావా అది నీ వల్ల కాదు కదా నీకు నౌకరు ఇచ్చిన కేసేఆర్ వల్ల కూడా కాదు.అంటూ తన ఘాటు వ్యాఖ్యలకి బీజం వేశాడు..అంతే ఇక అక్కడితో వాటికి పులిస్టాప్ పడలేదు.

తలసాని నువ్వు నన్ను ఏమి చేయలేవు..నన్నే కాదు కొడంగల్ లో ఉన్న పశువుల పేడ కూడా పిసకలేవు అంటూ చాలా తీవ్ర మైన వ్యాఖ్యలు చేశారు.నీ య‌జమాని కేసీఆర్ రెండు పెగ్గులు వేస్తే కాని లేవ‌లేడ.మరో నాలుగు వేస్తే గాని నిల‌బ‌డ‌లేడు..ఇక నువ్వు ఏంటి నన్ను పీకేది..నీకు సరిగా నా గురించి తెలియదు కాదు నీ యజమానిని అడుగు అని త‌ల‌సానికి రేవంత్ సూచించారు. గొర్రెల మంత్రి నువ్వు నీ ఊరిలో ఎన్ని గొర్రెలు ఇచ్చావ్..ఎన్ని నిధులు తెచ్చావు లెక్క చెప్పగలవా అంటూ కౌంటర్ వేశాడు.

అయితే అక్కడి ప్రజలని ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే కారణం మీరు నా పై చూస్తున్న అభిమానాలే..నేను ఇక్కడి వరకు వచ్చేలా చేశాయి..ఇదే సహకారం చివరి వరకూ నాకు ఉండాలి అంటూ ప్రజలని కోరుకున్నారు..ఒకప్పుడు త‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన కొడంగ‌ల్ ఎవ్వ‌రికి తెలిసేది కాద‌ని..అయితే ఇప్పుడు ఏ పేప‌ర్లో చూసినా, టీవీల్లో చూసినా కొడంగ‌ల్ గురించే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ని రేవంత్ తెలిపారు. తెలంగాణ అంతా ఇప్పుడు కొడంగ‌ల్ చుట్టూనే చూస్తున్నార‌ని రేవంత్ చెప్పుకొచ్చారు. మరి కెసీఆర్,తలసాని రేవంత్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలకి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.