రాహుల్ ముందు రేవంత్ ఉంచిన డిమాండ్స్ ఇవే

ఒక పార్టీలో నుంచీ మరొక పార్టీలోకి ఎవరన్నా వెళ్తున్నారు అంటే…ఆపార్టీ మీద ప్రేమతోనో ఇక్కడ చేయలేని పనులు అక్కడ ఎదో చేసేద్దామని కాదు…వచ్చే ఎన్నికల్లో ఖర్చులకు కానీ.టికెట్ రిజర్వ్ చేసుకోవడానికి ముందునుంచీ వాళ్ళు వేసే ఎత్తుగడలు.

 Revanth Reddy Demands To Join Congress-TeluguStop.com

వాళ్ళు పార్టీ మారే సమయంలో చెప్పే కోరికల లిస్టుకి బెంబేలెత్తి పోతున్నారట ఆ పార్టీ నేతలు.ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే నమ్మవలసిన పరిస్థితి ఏర్పడుతోంది.

వైసీపి నుంచీ ఎంపీ గా ఎన్నికైన బుట్టా రేణుక .టిడిపిలోకి జంప్ చేయడానికి ఆమె టిడిపి ముందు ఉంచిన కోరికల చిట్టా వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూలు ఎంపీ సీటు, ప్ర‌చార ఖ‌ర్చు కింద 100 కోట్లు(అయితే, 70 ఇచ్చేందుకు బాబు ఓకే అన్నార‌ని స‌మాచారం) ఇవ్వాల‌ని ఆమె ప్ర‌థ‌మ డిమాండ్‌గా పెట్టార‌ట‌.ఇక‌, నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి ప‌నుల‌కు 300 కోట్లు, కొన్ని కాంట్రాక్టులు ఇవ్వాల‌ని బుట్టా త‌న చిట్టాను బాబుగారికి అందించారు అని టాక్ నడుస్తోంది…మరి వైసీపి ని సరైన సమయంలో దెబ్బకొట్టి ప్రజలలోవైసీపి క్రేజ్ తగ్గించాలంటే ఆ మాత్రం ఖర్చు చేయకపోతే ఎలా మరి అనుకుంటున్నారు నేతలు.

బుట్టా విషయం ఇలా ఉంటే.చంద్రబాబుకి తగిలిన షాక్ పెద్ద విషయమే కాదు ఇంతకూ మించిన కోరికలతో టి -టిడిపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాహుల్ ముందు పెట్టిన కోరికెల లిస్టు చూసి కళ్ళు బైర్లు కమ్మినాయట.

రాహుల్ డిల్లీ వెళ్లి అక్కడ రాహుల్ తో భేటీ అయ్యారు అనే ప్రచారం జరుగుతోంది.ఈ సంద‌ర్భంగా తాను కాంగ్రెస్‌లో చేరాలంటే.

ప్ర‌చార క‌మిటీ అధ్య‌క్ష ప‌ద‌వితో పాటు.త‌న మిత్రులు, శ్రేయోభిలాషులు అయిని 25 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాల‌ని ఆ పేర్ల జాబితాను సైతం రాహుల్ కి వినిపించారు అని సమాచారం.

ససేమిరా అన్న రాహుల్ కేవలం 15 ఇచ్చేందుకు రెడీ అయ్యార‌ని స‌మాచారం… రేవంత్ పర్యటన చాలా మంది ఆసక్తిని రేపుతుంటే టి – కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం గుండెలు మొకాలులోకి జారిపోతున్నాయి.

టి-కాంగ్రెస్ వాళ్ళు ఇంతాగా టెన్షన్ పడటానికి కారణం రాహుల్ అడిగిన ఆ ఎమ్మెల్యేలు సీట్లలో ఎవరి సీటుకు ఎసరు పెట్టాడో అనే కంగారు.

అయితే రేవంత్ రెడ్డి ‘ఎసరు’ పెట్టిన సీట్లు ఎవరివి అన్నది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకంగా మారనుంది.ఆ మ్యాట‌ర్ లీక్ అవ్వ‌డంతో ఇప్పుడు రేవంత్ ఎఫెక్ట్ ఏ నియోజ‌క‌వ‌ర్గాల మీద పడుతుంది ? ఎవ‌రి సీట్ల‌కు ముప్పు వ‌స్తుంద‌న్న టెన్షన్ నేతలని పట్టి పీడిస్తోంది.మొత్తానికి ఇప్పుడు రేవంత్ టి-కాంగ్రెస్ లోకి వెళ్ళడం ఇటు తెలుగుదేశం…టి-కాంగ్రెస్ నేతలకి టెన్షన్ పుట్టిస్తోంది.కానీ రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్ళడం టిడీపికి ఎదురుబ్బగానే చెప్పుకోవాలి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube