రేవంత్ భవిష్యత్ ఏంటో ? ఇదే చివరి ఛాన్స్ ?

ఎవరు కలిసి వచ్చినా, రాకపోయినా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి సొంత పార్టీ నాయకుల నుంచి ఆశించినంత స్థాయిలో మద్దతు లభించడంలేదు.ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా, రేవంత్ ఒంటరిగానే టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఒకవైపు పోరాటం చేస్తూనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 Revanth Reddy Target On Ghmc Elections Revanth Reddy, Congress, Ghmc Elections,-TeluguStop.com

అదీ కాకుండా, త్వరలోనే పిసిసి అధ్యక్ష పదవిని భర్తీ చేసే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉండడంతో, మరింత యాక్టివ్ గా రేవంత్ తెలంగాణ రాజకీయాల్లో తన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇదిలా ఉంటే త్వరలోనే జిహెచ్ఎంసి ఎన్నికలు రాబోతున్న తరుణంలో, రేవంత్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభావం కనిపించకుండా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా చేస్తే అధిష్టానం దగ్గర తన పలుకుబడి పెరుగుతుంది అని, తన రాజకీయ భవిష్యత్తు కు బంగారు బాట ఏర్పడుతుంది అని దీంతో పాటు, పాటు పిసిసి అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో రేవంత్ జిహెచ్ఎంసి ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.జిహెచ్ఎంసి పరిధిలో 150 డివిజన్లు ఉండగా అందులో రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గంలో 48 డివిజన్ లు ఉన్నాయి.

వీటన్నిటిపైనా, పట్టు సాధిస్తే, తనకు తిరుగే ఉండదని టీఆర్ఎస్ దూకుడు తగ్గించవచ్చనే విధంగా రేవంత్ ప్లాన్ చేసుకుంటున్నారు.

ముఖ్యంగా తన నియోజకవర్గ పరిధిలోని 41 డివిజన్ లో పాదయాత్ర చేపట్టి, ఫలితాలు అనుకూలంగా మార్చుకోవాలని అభిప్రాయంలో ఉన్నారు.

ఈ విషయంలో పార్టీ సీనియర్ నాయకులు కలిసి వచ్చినా, రాకపోయినా ఒంటరిగానే పాదయాత్ర చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ విషయంలో మిగతా కాంగ్రెస్ నాయకుల వ్యవహారం ఎలా ఉన్నా రేవంత్ మాత్రం తన పలుకుబడి పెంచుకునేందుకు మాత్రం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

ఆయన సొంత పార్టీ పెట్టబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ దూకుడు ఎక్కువయినట్టుగా కనిపిస్తోంది.ఒకవేళ పిసిసి అధ్యక్ష పదవి దక్కకపోతే కాంగ్రెస్ కు గుడ్ బాయ్ చెప్పి, సొంత పార్టీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా రేవంత్ వ్యవహారం కనిపిస్తోంది.

రేవంత్ కాంగ్రెస్ లో ఉన్నా, సొంత పార్టీ పెట్టినా గెలుపు మాత్రం ఆయనకు ప్రతిష్టాత్మకమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube