ఆర్టీసీ 85 వేల కోట్ల ఆస్తులపై కేసీఆర్‌ కన్ను

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను సీఎం కేసీఆర్‌ చాలా నిర్లక్ష్య వైఖరితో చూస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయబద్దమైన డిమాండ్లను కేసీఆర్‌ ఒకప్పుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 Revanth Reddy Comments On Kcr And Rtc Profit-TeluguStop.com

ప్రస్తుతం ఆర్టీసీకి 85 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఆ ఆస్తులను చేజిక్కించుకునేందుకు ఆర్టీసీని నిర్విర్యం చేసేందుకు కేసీఆర్‌ కుట్ర పన్నాడని, అలాగే తన వారికి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపించాడు.

ఆర్టీసీ విలీనం చేయాలని, లేదంటే కేసీఆర్‌ మరియు ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో ప్రతిఫలం ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండు వారాలు పూర్తి అయ్యి మూడవ వారంలోకి ఎంటర్‌ అయ్యింది.అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై రేవంత్‌ రెడ్డి అసహనం వ్యక్తం చేశాడు.

భవిష్యత్తులో ఆర్టీసీ అనేది లేకుండా చేయాలనే ప్రయత్నాలు కేసీఆర్‌ చేస్తున్నాడని రేవంత్‌ రెడ్డి అన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube