హరీష్‌ ఎందుకు నోరు మెదపడం లేదు?  

Revanth Reddy Comments On Harish Rao And Cm Kcr-formar Rtc Incharge Harish Rao Silent,revanth Reddy,telangana Cm Kcr

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి పీఆర్టీయూ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నాడు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు.

Revanth Reddy Comments On Harish Rao And Cm Kcr-formar Rtc Incharge Harish Rao Silent,revanth Reddy,telangana Cm Kcr-Revanth Reddy Comments On Harish Rao And Cm KCR-Formar Rtc Incharge Silent Revanth Telangana Kcr

సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై మండి పడ్డాడు.గత ఆరు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి సచ్చివాలయంకు రాని కేసీఆర్‌ ఒక్క రోజు సమ్మె చేయగానే ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించడం ఏంటీ అంటూ ప్రశ్నించాడు.ఆరు ఏళ్లుగా ఉద్యోగానికి రాని కేసీఆర్‌పై పీడీ యాక్ట్‌ కింద కేసు పెట్టాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశాడు.

Revanth Reddy Comments On Harish Rao And Cm Kcr-formar Rtc Incharge Harish Rao Silent,revanth Reddy,telangana Cm Kcr-Revanth Reddy Comments On Harish Rao And Cm KCR-Formar Rtc Incharge Silent Revanth Telangana Kcr

గతంతో ఆర్టీసీ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరించిన మంత్రి హరీష్‌ రావు ఈ విషయమై ప్రస్తుతం ఎందుకు మాట్లాడటం లేదు అంటూ రేవంత్‌ రెడ్డి ప్రశ్నించాడు.ఉద్యోగుల సమస్యలు ప్రస్తుతం ఆయనకు కనిపించడం లేదా, ఆయనకు వారి కష్టాలు తెలియడం లేదా అంటూ రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారిని డిమాండ్స్‌ను పరిష్కరించాల్సిందిగా డిమాండ్‌ చేశాడు.ఈ సందర్బంగా ఆర్టీసీ కార్మికులకు ఆయన కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించాడు.