రేవంత్ ఛాలెంజ్ లకు టీఆర్ఎస్ ఎందుకు భయపడుతోంది ?

తెలంగాణలో విమర్శల రాజకీయమే కాకుండా, ఛాలెంజ్ ల రాజకీయం ఇప్పుడు మొదలైంది.కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఛాలెంజ్ లను టీఆర్ఎస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

 Revanth Reddy Challenges Not Accsepted On Trs Government, Revanth Reddy, Congres-TeluguStop.com

అసెంబ్లీ లో డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి తీవ్ర స్థాయిలో, అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం నడుస్తోంది.నగరంలో లక్షల ఇళ్లు కట్టించాము అంటూ గొప్పగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం దమ్ముంటే తమకు ఆ ఇళ్లను చూపించాలంటూ కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క టీఆర్ఎస్ కు సవాల్ విసరడం, ఆ సవాల్ ను సీరియస్ గా తీసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను బట్టి విక్రమార్క ఇంటికి పంపించి, ఆ ఛాలెంజ్ ను స్వీకరించింది.

తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మల్లు భట్టి విక్రమార్క ను తన కారులో ఎక్కించుకుని నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూపించి, ఆయన విమర్శలకు చెక్ పెట్టారు.

ఈ విషయంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పై విమర్శలు చేసేందుకు అవకాశం ఏర్పడలేదు.

ఇదంతా ఇలా ఉంటే, అనేక అంశాలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే, అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు.నిత్యం ఆయన టీఆర్ఎస్ పై సవాళ్లు చేస్తూనే ఉంటున్నారు.

ఎన్నో సందర్భాల్లో బహిరంగంగా చాలెంజ్ లు కూడా విసిరారు.కానీ ఎప్పుడూ, ఆయన ఛాలెంజ్ లను ప్రభుత్వం స్వీకరించలేదు.

కానీ బట్టి విక్రమార్క చేసిన ఛాలెంజ్ కు మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంది.రేవంత్ విషయంలో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేస్తోంది.

Telugu @revanth_anumula, Congress, Mallubatti, Revanth Reddy-Telugu Political Ne

బట్టి ఛాలెంజ్ లకు స్పందించినట్టుగానే రేవంత్ ఛాలెంజ్ లకు కూడా స్పందించి, వాస్తవం ఏమిటో చూపిస్తే మళ్లీ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు అవకాశం లేకుండా చేయవచ్చు.కానీ ఆయన విషయంలో మాత్రం టీఆర్ఎస్ మౌనంగానే ఉండిపోతుంది.రేవంత్ ను కట్టడి చేసే అవకాశం కోల్పోతోంది.టీఆర్ఎస్ రేవంత్ దూకుడును తగ్గించే మంచి అవకాశాన్ని వదులుకుంటూనే ఉంది.రేవంత్ ఛాలెంజ్ లకు స్పందిస్తే అనవసరంగా ఆయనకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందనే అభిప్రాయంతోనే ఈ విధంగా వ్యవహరిస్తోందనే వ్యాఖ్యలు సైతం ఇప్పుడు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube