ఆ విరాళాల లెక్క తేల్చాల్సిందే అంటున్న రేవంత్ ?  

Revanth Reddy, Corona Donations, COVID Relief funds, Revanth reddy letter to PM Modi - Telugu Corona Donations, Covid Relief Funds, Revanth Reddy, Revanth Reddy Letter To Pm Modi

తెలంగాణ అధికార పార్టీని ఇరుకున పెట్టే విషయంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.ఏదో ఒక అంశంతో తో ఆ పార్టీ అగ్రనేతలను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా, రేవంత్ అడుగులు వేస్తున్నారు.

 Revanth Letter Pm Modi Covid Relief Funds

ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ వ్యవహారం పైన రేవంత్ చాలా హడావుడి చేశారు.అక్రమంగా ఆయన నిషేధిత ప్రాంతంలో ఫామ్ హౌస్ నిర్మించారని, కోర్టులో పిటిషన్ వేసి హడావుడి చేశారు.

ఆ వ్యవహారంలో కేటీఆర్ కోర్టు నుంచి స్టే తెచ్చుకుని కాస్త ఉపశమనం పొందారు.కానీ ఈ ఈ వ్యవహారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఇబ్బందులకి గురయ్యింది.

ఆ విరాళాల లెక్క తేల్చాల్సిందే అంటున్న రేవంత్ -Political-Telugu Tollywood Photo Image

కేటీఆర్ తప్పు చేశారని భావన తెలంగాణ ప్రజల్లోనూ నెలకొంది.

ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయనిధి కి వచ్చిన విరాళాల పై ఆయన గురి పెట్టారు.

అసలు ఆ వివరాలు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు.వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టారు అనే విషయంపై నిగ్గు తేల్చాలి అంటూ దీనిపై విజిలెన్స్ విచారణ చేయించాలని నేరుగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ కి లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

కరోనా సమయంలో లాక్ డౌన్ ప్రారంభమైన తరువాత పెద్ద ఎత్తున విరాళాలు ప్రభుత్వానికి వచ్చాయని, కేంద్రంలో సీఎం కేసీఆర్ పేరిట ఓ ఫండ్ ను ఏర్పాటు చేశారని, వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఇటువంటి ఫండ్ సేకరణ కు ఏర్పాట్లు చేసుకున్నా, సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇవ్వాలనే సూచనలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన వాణిజ్య సంస్థలు భారీ ఎత్తున విరాళాలు అందించారని రేవంత్ రెడ్డి అన్నారు.

ఏపీలో నియోజకవర్గానికి కోటి రూపాయలు అందించాలనే నిబంధనలు అక్కడి నాయకులకు పెట్టడంతో, ప్రజల నుంచి భారీగా విరాళాలు సేకరించారని, తెలంగాణలో ఆవిధంగా సేకరించక పోయినా, భారీ ఎత్తున కార్పొరేట్ సంస్థలు విరాళాలు అందించాయని, కానీ వీటిని దుర్వినియోగం చేశారని రేవంత్ గట్టిగా వాదిస్తున్నారు.అందుకే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో విచారణ చేయించి నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికీ టిఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై బీజేపి ఆగ్రహంగా ఉండడంతో రేవంత్ లేఖ ఆధారంగా బిజెపి ఈ వ్యవహారంపై విచారణ చేయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

#Revanth Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Revanth Letter Pm Modi Covid Relief Funds Related Telugu News,Photos/Pics,Images..