భారీ వ్యూహాలు ర‌చిస్తున్న రేవంత్‌.. క‌లిసొస్తున్న ఇతర పార్టీలు..

తెలంగాణలో ఒక‌ప్పుడు కేసీఆర్‌కు ఎదురే లేద‌ని అంతా అనుకునేవారు.ఇంకా చెప్పాలంటే అస‌లు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం అవ‌స‌ర‌మా అన్న స్థాయిలో టీఆర్ఎస్ నేత‌లు మాట్లాడేవారు.

 Revanth Is Writing Big Strategies Other Parties Are Working Revanth, Ts Politics-TeluguStop.com

కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి.ప్ర‌తిప‌క్షాలు క్ర‌మ క్ర‌మంగా బ‌ల‌ప‌డిపోవ‌డంతో టీఆర్ ఎస్‌కు టెన్ష‌న్ మొద‌లైంది.

ఇక మ‌రీ ముఖ్యంగా రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన త‌ర్వాత విమ‌ర్శ‌లు మ‌రీ ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.బీజేపీ మిన‌హాయించి మిగ‌తా అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ తో క‌లిసి న‌డుస్తున్నాయి.

ఇందులో భాగంగానే నాయకులు ఏకతాటిపైకి నడిపిస్తున్నారు రేవంత్‌.

వీరంతా కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఒక్క తాటిమీద‌కు వ‌చ్చి గళం వినిపిస్తున్నార‌ని చెప్పాలి.

ఇక ఇప్ప‌టికే వ‌రుస స‌భ‌లు, నిర‌స‌న‌ల‌తో బాగానే ప్ర‌శ్నిస్తున్న రేవంత్ మిగ‌తా పార్టీల‌ను కూడా క‌లుపుకుపోయేందుకు రెడీ అయ్యారు.ఇందులో భాగంగా గాంధీభవన్‌లో తెలంగాణ‌లోని మిగ‌తా పార్టీల‌తో సమావేశం నిర్వ‌హించ‌డం సంచ‌ల‌నం రేపుతోంది.

ఇందులో బీజేపీ మిన‌హా ఇత‌ర పార్టీలు క‌లిసి వ‌స్తున్నాయి.ఇక వీరంతా కూడా గ‌తంలో కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన వారే.

ఇటు తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా అటు కేంద్రంలోని బీజేపీ తీసుకుంటున్న వ్య‌తిరేక విధానాలపై పోరాడేందుకు రెడీ అయ్యారు.

Telugu Cm Kcr, Congress, Revanth, Telonga, Tg, Ts-Telugu Political News

ఇందులో కాంగ్రెస్ తో క‌లిసి న‌డిచేందుకు సీపీఎం, సీపీఐతో పాటుగా టీజేఎస్‌, తెలంగాణ ఇంటి పార్టీ లాంటివి ఏక‌తాటిమీద‌కు వ‌చ్చి పెద్ద ఎత్తున ఉద్య‌మించేందుకు రెడీ అవుతున్నారు.కాగా వీరంద‌రూ కూడా రేవంత్ సారథ్యంలోనే న‌డుస్తామ‌ని చెప్ప‌డంతో ఆయ‌న ఇమేజ్ మ‌రింత పెరిగిపోయింది.ఇక పోడు భూముల సమస్యలపై, అలాగే నిరుద్యోగం, రైతు సంఘాలు చేస్తున్న భారత్ బంద్‌, లాంటి పెద్ద కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు.

ఇక‌రాబోయే రోజుల్లోనే వ‌రుస ఉద్య‌మాల‌కు ప్లాన్ వేశారు రేవంత్‌.దీంతో కాంగ్రెస్ మ‌రింత బ‌ల‌ప‌డనుంద‌ని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube