కేసీఆర్ ఇలాకాల‌నే టార్గెట్ చేస్తున్న రేవంత్‌.. టీఆర్ ఎస్‌లో టెన్ష‌న్‌

రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఇలా బాధ్య‌త‌లు తీసుకున్నారో లేదో అలా పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు.ఇందులో భాగంగా ఇప్ప‌టికే ద‌ళిత‌, గిరిజ‌న దండోరా కార్య‌క్రమాల‌ను తీసుకుని సంచ‌ల‌నం రేపుతున్నారు.

 Revanth Is Targeting Kcr Areas  Tension In Trs, Revanth, Kcr  , Ts Poltics , Kcr-TeluguStop.com

అయితే ఇంకోవైపు ప్ర‌ధానంగా ఆయ‌న కేసీఆర్ ను మాత్ర‌మే టార్గెట్ చేస్తూ త‌న విమ‌ర్శ‌లు, కౌంట‌ర్లు ఉండేలా చూసుకుంటున్నారు.దీంతో ఆయ‌న ఇప్పుడు మ‌రో ప్లాన్ వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఎలాగైతే కేసీఆర్ కొడంగ‌ల్ రేవంత్‌ను ఓడించేందుకు ప్లాన్ చేశారో ఇప్పుడు కేసీఆర్ కు కూడా త‌న ఇలాకాలో చెక్ పెట్టాల‌ని రేవంత్ చూస్తున్నారంట‌.

అయితే ఇది అయ్యే ప‌ని కాద‌ని తెలిసినా కూడా త‌న ప్ర‌భావం అయితే కేసీఆర్ ఇలాకాలో చూపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంట‌.

ఇక ఇందులో భాగంగా కేసీఆర్ దత్తత తీసుకున్న మూడుచింతపల్లి గ్రామంలో దీక్ష చేయ‌డం కూడా పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.నిన్న అన‌గా మంగళవారం స్టార్ట్ చేసిన దీక్షను రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం దళిత ఆత్మగౌరవ సభతో ముగించేందుకు ప్లాన్ చేస్తున్నా కూడా త్వ‌ర‌లోనే మ‌రిన్ని స‌భ‌ల‌ను నిర్వ‌హించేదుకు ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.

Telugu Dalithaatma, Gajwale, Revanth, Trs, Ts Congress, Ts Poltics-Telugu Politi

ఇక దీంతో పాటే ఆయ‌న మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య కూడా చేశారు.తాను త్వ‌ర‌లోనే గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో స‌భ నిర్వ‌హిస్తానంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.ఇక ద‌త్త‌త గ్రామాల్లో ఎలాంటి డెవలప్ మెంట్ కార్యక్రమాలు జరగలేదని చూపించ‌డంతో మీడియా మొత్తం అక్క‌డే ఫోక‌స్ పెట్టింది.దీంతో ఇన్ని రోజులు ఈ గ్రామాల‌ను ప‌ట్టించుకోని వారు కూడా వీటి గురించి మాట్లాడుకోవ‌డంతో కేసీఆర్ ప్ర‌తిష్ట దెబ్బ తినేలా క‌నిపిస్తోంది.

దీంతో పాటే ఆయ‌న త్వ‌ర‌లోనే గ‌జ్వేల్ స‌భ‌లో మ‌రిన్ని చిక్కులు తెచ్చిపెట్టే ప్ర‌మాదం ఉంద‌ని టీఆర్ ఎస్ నేత‌లు భావిస్తున్నారంట‌.చూడాలి మ‌రి రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందో రేవంత్ రాజ‌కీయాలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube