రేవంత్ ఇంత చేస్తున్నా... వారు మాత్రం కింద‌కు లాగేందుకే చూస్తున్నారంట‌..!

తెలంగాణ వ‌చ్చినప్ప‌టి నుంచి క్ర‌మంగా బ‌ల‌హీన ప‌డుతూ వ‌స్తోంది కాంగ్రెస్ పార్టీ.క‌నీసం ఏ ఎన్ని క‌ల్లోనూ పోటీ ఇవ్వ‌కుండా చ‌తికిల‌ప‌డుతోంది.

 Revanth Is Doing This ... But They Are Just Looking To Pull It Down Revanth, Co-TeluguStop.com

దీంతో ఢిల్లీ అధిష్టానం ఎలాగైనా కాంగ్రెస్‌ను బ‌తికించుకోవాల‌ని ఎంద‌రు వ్య‌తిరేకిస్తున్నా కూడా రేవంత్ రెడ్డికే టీపీసీసీ ప‌ద‌వి ఇచ్చింది.దీతో ఆయ‌న ప‌గ్గాలు తీసుకున్న‌ప్ప‌టి నుంచి కాంగ్రెస్‌ను మ‌ళ్లీ రేసులోకి తీసుకొచ్చేందుకు ఎంత చేయాలో అంత చేస్తున్నారు.

వ‌రుస‌గా నిర‌స‌న‌లు, ధ‌ర్నాల‌తో కాంగ్రెస్ ఉనికిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.కానీ ఆయ‌న ఇంత చేస్తున్నా సీనియ‌ర్లు మాత్రం పెద్ద‌గా క‌లిసి రావ‌ట్లేదు.

అయినా రేవంత్ ఇవేమీ ప‌ట్టించుకోకుండా త‌న పని తాను చేసుకుంటూ పోతున్నారు.కాగా ఇప్పుడు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన చాలామందిని మ‌ళ్లీ క‌లుస్తూ పార్టీలోకి రావాలంటూ కోరుతున్నారు.

ఇదే క్ర‌మంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా ఈ మ‌ధ్య‌నే క‌లిసి ఎలాగైనా పార్టీలోకి రావాలంటూ కోర‌డం ఇక విశ్వేశ్వర్ రెడ్డి కూడా దానికి ఓకే చెప్ప‌డం చ‌క‌చ‌క‌3ఆ జ‌రిగిపోయాయి.ఆయ‌నొక్క‌రే కాదు ఇలా చాలామందిని రేవంత్ కాంగ్రెస్ గూటికి ర‌ప్పిస్తున్నారు.

ఇక ఇప్ప‌టికే మహబూబ్ నగర్ కాషాల పార్టీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్ ను తీసుకొచ్చాడంటే ఆయ‌న ప‌నిత‌నం అర్థం చేసుకోవ‌చ్చు.

Telugu Congress, Komati Reddy, Pcc, Revanth, Ts Congress, Uttanm Kunmar-Telugu P

ఇక డి.శ్రీనివాస్ కొడుకు సంజయ్ ని హ‌స్తం గూటికి ర‌ప్పించారంటే రేవంత్ ఎంత క‌ష్ట‌ప‌డుతున్నాడో క్లియ‌ర్ గా తెలిసిపోతోంది.మ‌రి రేవంత్ ఇంత‌గా క‌ష్ట‌ప‌డుతున్నా కూడా సీనియ‌ర్లు మాత్రం సహకారం అందించ‌ట్లేదు.

త‌న‌ను వ్య‌తిరేకించిన వారిలో కేవ‌లం ఒక్కరిద్దరు సీనియర్లు మాత్ర‌మే కాస్త అండ‌గా ఉంటున్నారు.కానీ మిగ‌తా వార‌యితే ఏకంగా రేవంత్ నే కింద‌కు లాగేయాల‌ని ట్రై చేస్తున్నారు.

ఎందుకంటే పార్టీ బ‌ల‌ప‌డితే రేవంత్ క్రేజ్ అమాంతం పెరిగిపోతుంద‌ని భ‌య‌ప‌డిపోతున్నారు.ఇక కోమటిరెడ్డి వారైతే రేవంత్ కు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

ఏకంగా హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు 5శాతం ఓట్లు కూడా రావంటూ కామెంట్లు చేస్తున్నారంటే వారి తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెప్పుడు వారి అల‌క వీడుతారో రేవంత్‌కు అర్థం కావ‌ట్లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube