రేవంత్ భ‌య‌మే టీఆర్ ఎస్ నేత‌ల ధైర్య‌మా..?

రేవంత్ టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన త‌ర్వాత మాత్రం ఆరోప‌ణ‌లు విప‌రీతంగా పెరిగిపోయాయి.ముందు నుచే దూకుడుగా ఉండే రేవంత్ ఇప్పుడు మ‌రింత రెచ్చిపోతున్నారు.

 Revanth Fear Is The Courage Of Trs Leaders , Revanth, Trs , Mallareddy, Trs Mla-TeluguStop.com

ఓ రేంజ్‌లో టీఆర్ ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల‌పై వ్యాఖ్య‌లు చేస్తున్నారు.దీంతో వారు కూడా రెచ్పిపోయి మ‌రీ తిట్ల పురాణం ఎత్తుకుంటున్నారు.

ఇక మొన్న‌టికి మొన్న రేవంత్ మంత్రి మ‌ల్లారెడ్డిపై ఏ విధంగా అయితే తిట్ల పురాణం ఎత్తుకున్నారో అదే విధఃగా మంత్రి మ‌ల్లారెడ్డి కూడా రెచ్చిపోయారు.ఇక ఇప్పుడు రాజీనామాల‌కు ఆయ‌న స‌వాల్ విస‌ర‌డం పెద్ద సంచల‌నం రేపుతోంది.

అయితే మంత్రి మ‌ల్లారెడ్డి మాత్ర‌మే కాదు చాలామంది టీఆర్ ఎస్ నేత‌లు పైకి మాట్లాడ‌క‌పోయినా కూడా ఇదే విధంగా రేవంత్‌కు స‌వాల్ విసిరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.అదేంటంటే రేవంత్‌ను రాజీనామా చేసి త‌మ‌పై గెల‌వాల‌ని అంటున్నారు.

అయితే ఇప్పుడు మంత్రి మ‌ల్లారెడ్డి ఏకంగా త‌న మంత్రి ప‌ద‌వికి అలాగే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తానంటూ మాట్లాడ‌టం చూస్తుంటే రేవంత్‌కు నిజంగానే అంత‌లా భ‌య‌ప‌డుతున్నారా అని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు కూడా రేవంత్ క‌నీసం మ‌ల్లారెడ్డి స‌వాల్‌పై స్పందించ‌ట్లేదు.

Telugu Malla, Revanth, Revanthfear, Trs Mla-Telugu Political News

ఎందుకంటే రేవంత్‌కు ఇప్పుడు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే ప‌ద‌వి లేదు.ఆయ‌న ఇప్పుడు ఎంపీగా ఉన్న స్థానంలో ఉన్న వారంతా కూడా టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలే.ఇక మంత్రి మ‌ల్లారెడ్డి నియోజకవర్గంలో ఆయ‌న‌కు 2018 ఎన్నికల్లో దాదాపుగా 70వేలకుపైగా మెజార్టీ రావ‌డం విశేషం.అయితే ఇప్పుడు రేవంత్ ఒక‌వేళ ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు రెడీ అయినా కూడా త‌న టీపీసీసీ ప్రెసిడెంట్ ప‌ద‌వికి రాజీనామా చేయాలంటే వెన‌క‌డుగు వేస్తున్నారు.

పార్టీ పదవిని వదలుకోవటం రేవంత్‌కు అస్స‌లు ఇష్టం లేదు.అందుకే ఆయ‌న వెన‌క‌డుగు వేస్తున్నారు.కానీ ఇదే ఇప్పుడు ఆయ‌న‌కు స‌మ‌స్య‌గా మారుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube