కోవర్టులే టార్గెట్ గా రేవంత్ చర్యలు ? వారికి షోకాజ్ నోటీసులు ?

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయిన దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి తన మార్క్ ప్రభావం కనిపించేలా చేస్తున్నారు.పార్టీలో ఉన్న నాయకులు ఎవరెవరు అనే విషయాన్ని గుర్తిస్తూ, వారందరినీ పార్టీ నుంచి బయటకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

 Revanth Reddy, Telangana, Telangana Congress, Congress, Trs,ktr, Koushik Reddy,-TeluguStop.com

హుజురాబాద్ కీలక నేత పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం పై మొదట్లో రేవంత్ ఫోకస్ పెట్టారు.ఆయన కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నారనే అనుమానాలు కలగడంతో పాటు, ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కేటీఆర్ తో రహస్యంగా కౌశిక్ రెడ్డి మాట్లాడడం తదితర అంశాలతో కౌశిక్ రెడ్డి కి రేవంత్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

అయితే దీనిపై సమాధానం పూర్తిస్థాయిలో ఇవ్వకుండానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో కౌశిక్ రెడ్డి చేరిపోయారు.

దీంతో రేవంత్ అనుమానం నిజమే అనే అభిప్రాయం కలిగింది.

కౌశిక్ రెడ్డి తరహా కాంగ్రెస్ లో కోవర్టులు చాలామంది ఉన్నారు అని గ్రహించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వారందరినీ పార్టీ నుంచి బహిష్కరించే ఆలోచనలో ఉన్నారు.పూర్తిగా తన మాట వింటూ, పార్టీని అధికారంలోకి తెచ్చి వారే తప్ప సొంత పార్టీలోనే ఉంటూ, సొంత పార్టీకి చేటు తెచ్చే వారి వల్ల ఉపయోగం లేకపోగా, అనవసర ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి అనే అభిప్రాయంలో రేవంత్ రెడ్డి ఉన్నారు.

అయితే రేవంత్ రెడ్డి దూకుడు పై కాంగ్రెస్ లోని కొంతమంది సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతోనే ఉంటూ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Congress, Koushik Reddy, Niranjan Reddy, Revanth Reddy, Telangana-Telugu

రేవంత్ రెడ్డి పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటున్నారని, గిరిజన దళిత దండోరా ఏకపక్షంగా ప్రకటించారని, ఇంకా అనేక అంశాలపై అంతర్గతంగా ఓ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశం తాలూకా వివరాలను కావాలని మీడియాకు లీక్ చేశారు.దీంతో రేవంత్ రెడ్డి వెంటనే రియాక్ట్ అయ్యారు.

కాంగ్రెస్ సీనియర్ నేతలు నిరంజన్, ఘంటా సత్యనారాయణ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.వారు చేసిన వ్యవహారానికి సంబంధించి సరైన వివరణ ఇవ్వాలి అంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

పేరుకు పార్టీ సీనియర్లు గా చలామణి అవుతున్నా , చాలా మందికి ప్రజలలో పలుకుబడి లేదని, పార్టీలోనే ఉంటూ సొంత నేతల పై అసంతృప్తి వ్యక్తం చేయడమే ప్రధాన ఉద్దేశమని గ్రహించారు రేవంత్ గ్రహించారు.అందుకే ఆ తరహా నాయకులందరినీ కాంగ్రెస్ నుంచి బయటకు పంపడమే ఏకైక లక్ష్యంగా రేవంత్ ముందుకు వెళ్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube