అదో 'చెల్లని' కాగితం

తెలంగాణా తెలుగుదేశం పార్టీ ఫయిర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్…అండ్ బ్యాచ్ పై తీవ్రమైన పధ జాలంతో విరుచుకు పడ్డారు.ఆయన మాట్లాడుతూ…కేసీఆర్ మాస పుత్రిక ‘నమస్తే తెలంగాణా’ లో వచ్చే వార్తలన్నీ తప్పుడు వార్తలేనని…అంతేకాకుండా సొంత డబ్బా కొట్టుకోవడానికే తప్పా.

 Revanth About Kcr Paper-TeluguStop.com

ఆ పేపర్ ఎందుకు పనికిరాదు అని, ఇక అదో చెల్లని కాగితం అంటూ రేవంత్ కేసీఆర్ అండ్ పార్టీ పై విరుచుకు పడ్డారు.అదే క్రమంలో తాను మైకు పట్టుకుంటే కేసీఆర్ కు, టీఆరఎస్ కు వెన్నులో వణుకు పుడుతుంది అని ఆయన కామెంట్ చేశారు.

చెక్ పోస్ట్ ఎత్తివేతల విషయంలో మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.అంతేకాకుండా కాకతీయ మిషన్ పైనా రేవంత్ విరుచుకు పడ్డారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ ఓ మిషన్‌ కరెప్షన్‌ అన్నారు.

అక్రమాలు బయటపెడతారనే జర్నలిస్టులపై ఆంక్షలు విధించారని ఆరోపించారు.ఛెస్ట్ ఆసుపత్రిని తొలగించి, అక్కడకు సచివాలయ తరలింపును అడ్డుకుంటామన్నారు.

ఇక మరో పక్క తెలంగాణ ప్రభుత్వం ఇంజనీరింగ్‌ కళాశాలలకు విడుదల చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల్లో అప్పటి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.దీని పైన మంత్రి సూర్యాపేట కోర్టులో ఫిర్యాదు చేశారు.

దీనిపై పొన్నం స్పందించారు.అవినీతి ఆరోపణలకు వ్యతిరేకంగా తనపై మంత్రి పరువునష్టం దావా వేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

మీరు కోర్టుకు వెళితే, మేం ప్రజాకోర్టుకు వెళతామన్నారు.ఏది ఏమైనా ఎన్ని ఆశలతో తెలంగాణా రాష్ట్రం ఏర్పడినప్పటికీ పాలన మాత్రం అరకొరగానే సాగుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube