అలిగి వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి ! కారణం ఏంటి.. ?   Revant Reddy Suddenly Gone The Congress Committee Meeting     2018-11-06   22:59:39  IST  Sai M

కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు జరుగుతోంది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమయ్యింది. సమావేశంలో నియోజక వర్గాల అభ్యర్తుల ఎంపిక ఫైనల్ జరగుతోంది. టికెట్లు ఎవరికి దక్కుతాయోనని నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.

అయితే స్క్రీనింగ్ కమిటీ సమావేశంనుండి రేవంత్ రెడ్డి అర్దాంతరంగా బయటకు వెల్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లోకి రేవంత్‌రెడ్డితో పాటు చాలామంది నాయకులను వెళ్లరు. ఆ సమయంలో వారికి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం రేవంత్ కోరిన వారికి సీట్లివ్వడానికి స్క్రీనింగ్ కమిటీ సుముఖత వ్యక్తం చేయలేదని..అందువల్లే ఆయన సమావేశం మధ్యలోంచి వెళ్లిపోయాడని ప్రచారం జరుగతోంది