అవార్డులు వెనక్కి ... నిరసనకు సంకేతం

ప్రధాని నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా, మాట అసహనానికి నిరసనగా కవులు , కళాకారులు , రచయితలు, సినిమా రంగానికి చెందిన వారు అవార్డులను వెనక్కి ఇవ్వడాన్ని సీనియర్ నటి షబానా ఆజ్మీ సపోర్ట్ చేసింది.ఇలా చేయడం నిరసనకు సంకేతం అని అన్నారు.

 Returning Awards Is A Symbolic Gesture-TeluguStop.com

నిరసన తెలియ చేస్తూ ఒక రచయిత పుస్తకం రాయాలంటే చాలా కాలం పడుతుందని, ఒక సినిమా తీయాలంటే చాలా రోజులు పడుతుందని, అందుకే వెంటనే నిరసన తెలియచేయడానికి తమ అవార్డులు వెనక్కి ఇస్తున్నారని షబానా ఆజ్మీ చెప్పారు.గత వారం రోజుల్లో తొమ్మిది మంది రచయితలు అవార్డులు వెనక్కి ఇచ్చేశారు.

సినిమా కళాకారుల్లో పదమూడు మంది గతంలో తాము తీసుకున్న జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చారు.అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని కేంద్ర మంత్రులు తప్పు పడుతున్నారు.

బీజేపీకి అనుకూలంగా ఉన్న పత్రికలూ తీవ్రంగా విమర్శిస్తున్నాయి.యూపీఏ పాలనలో ఎన్నో ఘోరాలు, నేరాలు జరిగాయని వీరంతా అప్పుడు అవార్డులు ఎందుకు వెనక్కి ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు.

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా ఇదే అడిగారు.ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ అవార్డులు ఎందుకు వెనక్కి ఇవ్వలేదని నిలదేశారు.

బీజేపీకి అనుకూలంగా ఉన్న కొందరు సినిమా ప్రముఖులు, రచయితలు అవార్డులు వెనక్కి ఇచ్చినందువల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు.ఈ వివాదం ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube