లైబ్రరీ నుంచి తీసుకున్న పుస్తకాన్ని 82 సంవత్సరల తర్వాత రిటర్న్ ఎందుకంటే...!?

సాధారణంగా మనం ఒక లైబ్రరీ నుంచి ఏదన్నా ఒక పుస్తకం తీసుకున్నామంటే ఒక వారం రోజుల్లో దాన్ని మళ్ళీ లైబ్రరీలో తిరిగి ఇచ్చేస్తాము.కానీ ఎప్పుడో 82 ఏళ్ల తరువాత మిస్ అయిన ఒక పుస్తకం మళ్ళీ ఇప్పుడు 82 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చింది.

 Return-a-book-taken-from-the-library-after-82-years-because  Library,book, 82 Ye-TeluguStop.com

ఈ అరుదైన సంఘటన కెనడా దేశంలోని సిడ్నీ(ఆస్ట్రేలియాది కాదు)లోని బ్రెంటన్ రీజనల్ లైబ్రరీలో జరిగింది.పూర్తి వివరాలలోకి వెళితే జోర్జాన్​ ముజిక్​సిన్​ అనే వ్యక్తి తన ఇంట్లో ఎదో పనిచేసుకుంటున్న సమయంలో ఇంట్లోని అటకపై ది అడ్వంచర్స్​ ఆఫ్ డాక్టర్​ డోలిటిల్​ అనే పురాతన పుస్తకం ఒకటి కనిపించింది.

ఆ పుస్తకం 1939లో కేప్​ బ్రెంటన్ లైబ్రరీ నుంచి తెచ్చుకున్నదని గుర్తించారు.ఆ పుస్తకాన్ని గుర్తించిన వెంటనే తిరిగి లైబ్రరీకి పంపారు.అయితే ప్రస్తుతం ఆ ఇంట్లో ఉంటున్న కుటుంభం గత వందేళ్ల నుంచి అక్కడే నివాసం ఉంటుందని, బహుశా అప్పుడే ఆమె ఆ పుస్తకాన్ని లైబ్రరీ నుంచి తెచ్చుకొని ఇంట్లో పెట్టి ఉంటారని ముజిక్​సిన్ చెప్పారు.ఆ మహిళకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అంటే 1939లో ఈ పుస్తకాన్ని ఇంటికి తెచ్చుకొని వచ్చి ఉంటారు.

మళ్ళీ ఇన్ని ఏళ్లకు అంటే 82 సంవత్సరాలకు ఆ పుస్తకం తిరిగి మళ్ళీ కనిపించింది.ఈ విషయాన్ని కేప్ బ్రెంటన్ లైబ్రరీ ఇన్​స్టాగ్రామ్​లో వెల్లడించింది.

అయితే కొన్ని కారణాల వల్ల 1939లో ఈ పుస్తకాన్ని తీసుకున్న ఆ వ్యక్తి పేరు గాని, వివరాలను కానీ ప్రకటించలేదు.అయితే కొన్ని ఆ వ్యక్తి సంబంధించిన కొన్ని గుర్తులు మాత్రం ప్రకటించారు.

ఆ పుస్తకం తీసుకుని వెళ్ళింది ఒక లేడీ అని అర్ధం అయిపోతుంది.ఇంకా ఆ లేడీ ఎవరనేది ఫాలోవర్లే తెలుసుకోవాలని ప్రకటించారు.

ఆ పుస్తకం తీసుకున్న వ్యక్తికి సంబంధించిన హింట్స్ అంటూ ఆమె ఇనిషియల్ వి.ఎం., ఆమె 1920లో జన్మించారని తెలిపారు.సిడ్నీలోని సెంటర్ స్ట్రీట్​లో ఉన్న్ సమయంలో ఆమె ఈ పుస్తకాన్ని ఇక్కడ లైబ్రరీ నుంచి తీసుకెళ్లారట.ఒకవేళ పైనే తెలిపిన వివరాలతో పుస్తకం తీసుకెళ్లింది ఎవరని గుర్తిస్తే, వెంటనే మాకు మెయిన్ చేయండి అని లైబ్రరీ ప్రకటించింది.అలాగే ఆ లైబ్రరీ ఓవర్ డ్యూ ఫీజును తీసివేయడంతో డబ్బు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.

అయితే 1959లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల కేప్​ బ్రెంటెన్​ లైబ్రరీ భవనం కూలిపోయి దాదాపు 80వేలకు పైగా పుస్తకాలు కాలిపోయాయి.మళ్ళీ ఏడాదికి పునః ప్రారంభించారు.!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube