28 ఏళ్లకే క్రికెట్ కు రిటైర్మెంట్.. సంచలన నిర్ణయం తీసుకున్న యంగ్ క్రికెటర్..!

క్రికెట్ అంటే మనదేశంలో చాలా మందికి ఇష్టం.ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉండే పాపులర్ గేమ్ లలో క్రికెట్ కూడా ఉంది.

 Retirement To Cricket After 28 Years .. Young Cricketer Who Made A Sensational D-TeluguStop.com

మరి ఇటువంటి క్రికెట్ జాతీయ టీమ్ లో స్థానం సంపాధించడం కోసం చాలా కష్టపడాలి.ప్రాక్టీస్ చేసి తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ రావాలి.

ఇది ఇలా ఉండగా తాజాగా ఓ యువ క్రికెటర్ ఓ సెన్సేషనల్ ప్రకటన చేశాడు.టీమిండియా యువ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ రిటైర్మెంట్ చెప్పాడు.9 సంవత్సరాలుగా ఇండియా జట్టులో ఉన్ముక్త్ ఛాన్స్ కోసం తపిస్తున్నాడు.ఇటువంటి సమయంలో ఈ షాకింగ్ డెసిషన్ తీసుకోవడం పట్ల పలువురు అవాక్కయ్యారు.

ఉన్మక్త్‌ తాను చివరగా ట్విటర్‌ లో ఓ విషయం రాసి చెప్పాడు.అది బీసీసీఐకి ఉన్మక్త్ రాసిన నోట్.

అందులో అతను మాట్లాడుతూ.తాను ఇండియా జట్టుకు రిటైర్మెంట్ తెలుపుతున్నానని చెబుతూనే యూఎస్ జట్టులో ఉంటున్నానని తెలిపాడు.

ఉన్ముక్త్ ఈ ప్రకటన చేయంగానే చాలా మంది షాక్ అయ్యారు.2012వ సంవత్సరంలో అండర్‌ – 19 విభాగంలో వరల్డ్ కప్ జరుగుతోంది.ఆ సమయంలో ఉన్ముక్త్ కెప్టెన్ గా ఉన్నాడు.టీమిండియా జట్టును ముందు నుంచి నడిపించి ప్రత్యేక ఆటతీరును కనబరిచాడు.ఫైనల్ మ్యాచ్ లో ఉన్ముక్త్‌ చంద్‌ 111 రన్స్ సాధించి విజయం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు.ఆ సమయంలో టీమిండియా వరల్డ్ కప్‌ సాధించింది.

Telugu Indian, Unmukt Chand, Young Cricket-Latest News - Telugu

ఇంతచేసినా అతనికి ఇండియా జట్టులో ఛాన్స్ రాలేదు.అనుకున్నట్లుగా తాను ఆటతీరును కనబరచకపోవడంతో టీమిండియాలో చోటు దక్కలేదు.దీంతో అతను అండర్ – 19 విభాగంలోనే కొనసాగుతూ వచ్చాడు.ఆ తర్వాత తాజాగా ఇప్పుడు 28 సంవత్సరాల ప్రాయంలో భారత క్రికెట్ జట్టు నుంచి రిటైర్ అవుతున్నట్లుగా తెలిపాడు.

విదేశీ లీగ్‌ ల్లో ఆడేందుకే అతను టీమిండియాకు రిటైర్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు.తాను ఇలా రిటైర్మెంట్ ప్రకటించడంపై మరోవైపు తన బాధను వ్యక్తం చేస్తున్నా మరోవైపు ఇంకో ఫార్మెట్లో ఆడేందుకు సిద్దపడుతున్నట్లు తెలిపాడు.

ప్రస్తుతం అతి చిన్న వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించిన వ్యక్తిగా ఉన్ముక్త్ హాట్ టాపిక్ అయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube