నెల రోజులు కన్న కూతురు శవం ఇంట్లోనే ఉంచుకున్నారు.. ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించిన తల్లిదండ్రులు  

Retired Inspector Daughter Dead Body Found In Room In Up Mirzapur-telugu Viral News Updates,viral In Social Media

కన్న వారికి పిల్లలపై ఎంతో ప్రేమ ఉంటుంది. పిల్లలు ఎంత పెద్ద వారు అయినా కూడా ఆ పిల్లలపై ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది. తల్లిదండ్రులు ముసలి వారు అయినా కూడా పిల్లలు ఇంకా చిన్న పిల్లలే అన్నట్లుగా చూసుకుంటూ ఉంటారు..

నెల రోజులు కన్న కూతురు శవం ఇంట్లోనే ఉంచుకున్నారు.. ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించిన తల్లిదండ్రులు -Retired Inspector Daughter Dead Body Found In Room In Up Mirzapur

తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు ఉన్నారు కాని, పిల్లలను పట్టించుకోని తల్లిదండ్రులు చాలా తక్కువగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తల్లిదండ్రుల ప్రేమకు మరో సాక్ష్యంగా ఈ సంఘటన జరిగింది. స్థానికంగానే కాకుండా దేశ వ్యాప్తంగా జనాలతో కన్నీరు పెట్టిస్తున్న ఈ సంఘటన చాలా బాధాకరం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లోని ఒక ఇంట్లో రిటైర్డ్‌ ఎస్సై దంపతులు ఉంటారు. వారు తమ పనేదో తాము అన్నట్లుగా ఉంటారు.

చుట్టు పక్కల వారితో పెద్దగా పట్టింపులు లేకుండా ఉండేవారు. గత కొన్ని రోజులుగా ఆ ఇంటి నుండి దుర్వాసన ఎక్కువగా వస్తుండటంతో అసలేంటో అని ఆ ఇంట్లోకి కొందరు వెళ్లేందుకు ప్రయత్నించగా ఆ రిటైర్డ్‌ ఎస్సై మరియు ఆయన భార్య ఇంట్లోకి రానివ్వలేదు. మా ఇంట్లోకి మీరు రావాల్సిన అవసరం ఏంటీ అంటూ అక్కడ నుండి వారిని పంపించడం జరిగింది..

విషయాన్ని స్థానికులు పోలీసుల వద్దకు తీసుకు వెళ్లారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులను కూడా రానివ్వకుండా ఆ దంపతులు అడ్డుకున్నారు. కాని పోలీసులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు.

ఇంట్లోకి వెళ్లి చూస్తే కుళ్లి పోయిన స్థితిలో ఆ దంపతుల కూతురు శవం ఉంది. దయచేసి నిశబ్దంగా ఉండండి. తమ కూతురు నిద్ర పోతుందని ఆ దంపతులు అంటున్నారు..

వారికి నచ్చ జెప్పి ఆ శవంను అక్కడ నుండి తొలగించి పోస్ట్‌ మార్టంకు పంపించారు. స్థానిక ఎస్పీ ఈ విషయం గురించి మాట్లాడుతూ కూతురు చనిపోయిన నేపథ్యంలో వారిద్దరికి మతి బ్రమించిందని అన్నాడు. వారు ప్రస్తుతం పోలీసుల పర్యవేక్షణలో ఉన్నారు.

పోస్ట్‌మార్టం జరిగిన తర్వత అసలేం జరిగిందనే విషయం బయటకు వస్తుందని ఎస్పీ చెప్పుకొచ్చాడు. ఈ సంఘటన స్థానికుల్లో కన్నీరు తెప్పించింది.