ఐఏఎస్ ల దెబ్బ చంద్రన్నకి ఈ సారి గట్టిగా తగులుతుందా!  

చంద్రబాబు విమర్శలపై ఆగ్రహంతో రగిలిపోతున్న ఐఏఎస్ లు. .

Retired Ias Officers Of United For Opposite To Chandrababu-

ఏపీ రాజకీయాలలో కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ జోక్యంపై పదే పదే విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం ఏపీ చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై పదే పదే విమర్శలు చీస్తున్నారు. జగన్ అవినీతి కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి సిఎస్ గా ఎలా నియమిస్తారు అంటూ అతనిపై ఆరోపణలు చేసారు. అలాగే చీఫ్ సెక్రెటరీ మోడీకి తొత్తు అంటూ కామెంట్ చేసారు..

ఐఏఎస్ ల దెబ్బ చంద్రన్నకి ఈ సారి గట్టిగా తగులుతుందా!-Retired IAS Officers Of United For Opposite To Chandrababu

ఏపీలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర జరుగుతుందని అందులో భాగంగానే ఎల్వీ సుబ్రహ్మణ్యంని ఇక్కడికి పంపించారు అంటూ ఆరోపణలు చేసారు. అదే సమయంలో గవర్నర్ నరసింహన్ మీద కూడా బాబు, అతని బృందం ఇష్టారాజ్యంగా రెచ్చిపోతుంది. ఇలా పదే పదే గవర్నర్ మీద చీఫ్ సెక్రెటరీని టార్గెట్ గా చేసుకొని బాబు విమర్శలు చేయడంపై ఏపీకి చెందిన ఐఏఎస్‌లు గుర్రుగా ఉన్నారు.

ఈ నేపధ్యంలో వారంతా అమరావతిలోని పున్నమిఘాట్‌ హరిత హోటల్‌లో ఐఏఎస్‌లు సమావేశం అయ్యారు. ఐఏఎస్‌లపై చంద్రబాబు పదే పదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశానికి జవహర్‌రెడ్డి, జేఎస్వీ ప్రసాద్‌, ప్రవీణ్‌కుమార్‌, ప్రసన్న వెంకటేశ్‌, పీ ఉషాకుమారితో పాటు పలువురు ఐఏఎస్‌లు హాజరయ్యారు.

ముఖ్యంగా సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరుగుతోంది. నారా చంద్రబాబు వ్యాఖ్యలపై ఇటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు మాజీ ఐఏఎస్‌ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నారా చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు కూడా చేశారు.