జనసేన టికెట్లకు ... రిటైర్డ్ పోలీసులకు లింకేంటి..?  

జనసేన పార్టీ ఇప్పడు ఓ కొత్త సంప్రదాయానికి తేరా లేపింది. ఇప్పటికే పార్టీ టికెట్లు ఆశిస్తూ.. పెద్ద ఎత్తున నాయకులు క్యూ కడుతుండడంతో … ఎవరు సరైన అభ్యర్థులు ఎవరు గెలుపు గుర్రాలు అనేది తెలుసుకునేందుకు ఇప్పుడో సరికొత్త సర్వేకి తెరలేపారు. ఈ సర్వేకి మాజీ పోలీసు అదికారులను, ముఖ్యంగా ఇంటిలిజెన్స్‌లో పనిచేసిన వారిని వినియోగించుకుంటున్నారని సమాచారం.

Retierd Police Officers Enquiry For Janasena Party Candidates Details-

Retierd Police Officers Enquiry For Janasena Party Candidates Details

వీరైతే.. అభ్యర్థులను ఖచ్చితంగా ఎంపిక చేయగలరని, వారికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా వివిధ కోణాల్లో సేకరించగలరని భావించిన పవన్ వారికి ఈ బాధ్యత అప్పగించినట్టు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన సర్వే బృందం ఇప్పటికే పలువురు కీలక నేతల పేర్లతో ఓ నివేదికను రూపొందించి పవన్‌కు కూడా అందజేసినట్టు తెలుస్తోంది. ఈ రిపోర్ట్ ఆధారంగానే పవన్ అభ్యర్థుల ఎంపిక చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సర్వే పూర్తిస్థాయిలో కంప్లీట్ అయినట్టు జనసేనలోని కొంతమంది మీడియాకు లీకులు ఇచ్చారు.