అలాగైతే మీ గుండె ప్రమాదంలో ఉంది

రోజురోజుకి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది.రాబోయే తరాలు, హార్ట్ ఎటాక్, డయాబెటిస్ వలన మరింత బాధపడనున్నారు.

దీనికి కారణం తీసుకునే ఆహారం మాత్రమే కాదు, మన కదలిక కూడా అని చెబుతున్నారు డాక్టర్లు.అవును, మన శరీరానికి మనం ఇచ్చే విశ్రాంతి కూడా ప్రాణాంతకంగా మారుతోంది.

ఆధునిక యుగంలో మనిషి కష్టపడి చేసే పనులు తగ్గిపోతున్నాయి.ఇప్పుడంతా స్మార్ట్ యుగమే కదా.అన్ని పనులు కంప్యూటర్ లోనే.ఇది శారీరక అలసటని ఇవ్వట్లేదు.

దానికితోడు మానసిక ఒత్తిడి పెంచుతోంది.ఈ కారణంగా శరీరానికి తగినంత వ్యాయామం దొరకట్లేదు.

Advertisement

కంప్యూటర్ మీద కూర్చోవడం, గంటలకొద్దీ కూర్చొని పనిచేయడం, స్మార్ట్ ఫోన్ పట్టుకోని ఊరికే నడుం వాల్చడం .ఈ అలవాట్లు కంటికి కనబడని కీడు చేస్తున్నాయి శరీరానికి." ఖచ్చితంగా ఇన్ని గంటలపాటు శరీరం కదులుతూ ఏదో ఒక పని చేయాలని చెప్పలేం.

కాని నిద్ర మాత్రమే మనకు విశ్రాంతి సమయం.ఆ విశ్రాంతి శరీరానికి చాలు.

ఊరికే కూర్చోవడం, గంటల కొద్ది శరీరానికి ఎలాంటి పనిచెప్పకపోవడం మాత్రం మంచిది కాదు.ప్రతీవారం కనీసం 150 నిమిషాలైనా చిన్నపాటి వ్యాయామం, 75 నిమిషాల గట్టి వ్యాయామం శరీరానికి దొరకాలి.

ఇలా చేస్తే గుండె, రక్తం ఆరోగ్యంగా ఉంటాయి" అంటూ కాలిఫోర్నియా ప్రొఫెసర్‌ డెబొరా యంగ్ తెలిపారు.

వినాయకుడి పూజకు ఈ మొక్కను అస్సలు వాడకూడదు.. ఎందుకో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు