యూఎన్ ఔటర్ స్పేస్ ఆఫీస్‌లో ఎన్నారై ఎక్స్‌పర్ట్‌కి డైరెక్టర్‌ బాధ్యతలు.. ఆ వివరాలివే...

భారతదేశ సంతతికి చెందిన మరో ఎన్నారైకి తాజాగా అరుదైన గౌరవం దక్కింది.యునైటెడ్ నేషన్స్ (UN) వియన్నాలోని తన యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ (UNOOSA)కి యూకే ఎన్నారై ఆర్తీ హోల్లా-మైనిని ( Aarti Holla-Maini )డైరెక్టర్‌గా ఎంపిక చేసింది.

 Nri News, Unoosa, Outer Space Affairs, International Cooperation, Space Industry-TeluguStop.com

శాంతియుత ప్రయోజనాల కోసం, సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం స్పేస్‌ను ఉపయోగించడంలో దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి UNOOSA బాధ్యత వహిస్తుంది.

ఇక ఆర్తి హోల్లా-మైని అంతరిక్ష పరిశ్రమలో 25 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారు.

వివిధ రోల్స్‌లో పనిచేశారు.ఇటీవల, ఆమె నార్త్‌స్టార్ ఎర్త్ & స్పేస్‌లో సస్టైనబిలిటీ, పాలసీ ఇంపాక్ట్ కోసం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

అంతకు ముందు, ఆమె గ్లోబల్ శాటిలైట్ ఆపరేటర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్‌గా 18 ఏళ్లకు పైగా పనిచేశారు.

Telugu International, Nri, Outerspace, Satellite, Space, Unsecretary, Un Program

ఆర్తి అంతరిక్షానికి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రాజెక్టులు, కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు.ఆమె వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్( World Economic Forum ) యొక్క గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ ఆన్ స్పేస్, ఎకోల్ పాలిటెక్నిక్ ఫెడరలే డి లౌసాన్ (EPFL) స్పేస్ సెంటర్ ద్వారా నిర్వహించబడే స్పేస్ సస్టైనబిలిటీ రేటింగ్ అడ్వైజరీ గ్రూప్‌లో సభ్యురాలు.ఆర్తి యూరోపియన్ యూనియన్‌కు స్పేస్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై కూడా సలహా ఇచ్చారు.

యూఎన్‌ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్( UN World Food Programme ) సహకారంతో ఉపగ్రహాల ద్వారా అత్యవసర టెలికమ్యూనికేషన్ మద్దతును అందించడంలో సహాయపడే క్రైసిస్ కనెక్టివిటీ చార్టర్‌ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు.

Telugu International, Nri, Outerspace, Satellite, Space, Unsecretary, Un Program

ఆర్తి కింగ్స్ కాలేజ్ లండన్ నుంచి జర్మన్ చట్టంలో స్పెషలైజేషన్‌తో లా డిగ్రీని, HEC పారిస్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు.ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్శిటీకి కూడా హాజరయ్యారు.డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, పంజాబీ భాషలు మాట్లాడగలరు.

తన కొత్త పాత్రలో, అన్ని దేశాల ప్రయోజనాల కోసం అంతరిక్ష కార్యకలాపాలలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి UNOOSA, దాని ప్రయత్నాలకు నాయకత్వం వహించడానికి ఆర్తి బాధ్యత వహిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube