అమెరికాలో సిక్కులకు శుభవార్త.. ‘‘జాతీయ సిక్కు దినోత్సవం’’ కోసం ప్రతినిధుల సభలో తీర్మానం

భారతీయులకు అమెరికా రెండో ఇల్లుగా మారిపోయిన సంగతి తెలిసిందే.దశాబ్ధాల కిందటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం మనవారు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వలస వెళ్లారు.

ఇందులో భారత్‌లోని అన్ని రాష్ట్రాల వారూ వున్నారు.వీరంతా తమ తమ రంగాలలో రాణిస్తూ మాతృదేశానికి, ఆశ్రయం కల్పించిన అమెరికాకు గర్వకారణంగా నిలుస్తున్నారు.

మన జనాభా నానాటికీ విస్తరిస్తూ వుండటంతో భారతీయ పండుగలు, ఆచార వ్యవహారాలు అక్కడ కూడా వెలుగొందు తున్నాయి.మన పండుగలకు అమెరికాలోనూ సెలవు ప్రకటిస్తున్నారంటే అక్కడ భారతీయులు ఏ స్థాయిలో వున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వున్న సిక్కు ప్రజలకు ఊరట కలిగేలా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటు న్నాయి.ప్రతి ఏడాది ఏప్రిల్ 14న జాతీయ సిక్కు దినోత్సవంగా గుర్తించాలంటూ భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సహా డజనుకు పైగా చట్ట సభ సభ్యులు అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Advertisement

100 ఏళ్ల కిందటే అమెరికాకు వలస రావడం ప్రారంభించిన సిక్కు కమ్యూనిటీ.దేశాభి వృద్ధిలో కీలకపాత్ర పోషించిందని వారు తీర్మానంలో తెలిపారు.అలాంటి సిక్కు కమ్యూనిటీని గౌరవించు కునేందుకు గాను ‘‘జాతీయ సిక్కు దినోత్సవం’’ కోసం ఈ తీర్మానం మద్ధతు ఇస్తుందని వారు పేర్కొన్నారు.

కాంగ్రెస్ మహిళ మేరీ గే స్కాన్‌లాన్‌ ఈ తీర్మానాన్ని స్పాన్సర్ చేశారు.దీనికి కరెన్ బాస్, పాల్ టోంకో, బ్రియాన్ కె ఫిట్జ్‌పాట్రిక్, డేనియల్ మీసర్, ఎరిక్ స్వాల్‌వెల్, రాజా కృష్ణమూర్తి, డోనాల్డ్ నార్‌క్రాస్, ఆండీ కిమ్ , జాన్ గారామెండి, రిచర్డ్ ఈ నీల్, బ్రెండన్ ఎఫ్ బాయిల్, డేవిడ్ జి వలదావో‌లు మద్ధతు తెలిపారు.

వీరిలో జాన్ గరామెండి, డేవిడ్ వలదావోలు సిక్కు కాకస్‌కు సహ-అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.ఈ తీర్మానాన్ని సిక్కు కాకస్ కమిటీ, సిక్కు సమన్వయ కమిటీ, అమెరికన్ సిక్కు గురుద్వారా పర్బంధక్ కమిటీలు స్వాగతించాయి.కాగా.15వ శతాబ్ధంలో అవిభక్త భారత్‌లోని పంజాబ్‌లో సిక్కు మతం పుట్టింది.నేడు ప్రపంచ వ్యాప్తంగా 25 మిలియన్లకు పైగా ఈ మతాన్ని అనుసరిస్తున్నారు.అధికారిక గణాంకాల ప్రకారం.5,00,000 మంది సిక్కులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్నారని అంచనా.అగ్రరాజ్యం తర్వాత ఆస్ట్రేలియా, కెనడా, యూకేలలో పెద్ద సంఖ్యలో సిక్కులు స్థిరపడ్డారు.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు