రాజీనామా చేసిన సుప్రీంకోర్టు ఈసీ ప్యానల్ న్యాయవాది.. ?

రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల కమిషన్ పనితీరుపై ఈ మధ్య కాలంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అదీగాక ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యంగా బెంగాల్ ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీ తీవ్ర ఆరోపణలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

 Resigned Supreme Court Ec Panel Advocate-TeluguStop.com

అంతే కాకుండా ప్రతిపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, ఈసీఐ, బీజేపీ జేబు సంస్థగా వ్యవహరిస్తోందని దుమ్మెతి పోస్తున్నాయి.

ఈ నేపధ్యంలో సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం ప్యానల్ లో విధులను నిర్వహిస్తున్న లాయర్ మోహిత్ డి రామ్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

 Resigned Supreme Court Ec Panel Advocate-రాజీనామా చేసిన సుప్రీంకోర్టు ఈసీ ప్యానల్ న్యాయవాది.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఈసీ విధానాలు, నా విలువలు వేరని, ఈ కారణం వల్లే ప్యానల్ నుంచి తాను వైదొలగుతున్నానని చెప్పారు.ఇకపోతే ఎన్నికల కమిషన్ కు పని చేయడం తన జీవితం లో గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా సుప్రీం కోర్టులో ఈసీఐ, కోర్టు వాదనలపై ప్రసారం చేయకుండా మీడియాను నియంత్రించాలంటూ పిటిషన్ వేసిన నేపథ్యంలో మోహిత్ రాజీనామా చర్చకు దారితీసింది.

#Resigned #Advocate #Supreme Court #EC Panel #Mohit D Ram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు