టిఆర్ఎస్ లో రాజీనామాల కలకలం ! కేసీఆర్ ఆందోళన

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం టిఆర్ఎస్ కు పెద్ద తలనొప్పిగా మారింది .ఇప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు , నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

 Resignation Scandal In Trs! Kcr Concern, Trs Party , Ts Potics , Kcr , Bjp  Part-TeluguStop.com

మూడు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.ఈ వ్యవహారం ప్రశాంతంగానే ముగిసింది అనుకుంటున్న సమయంలో ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న చాలామంది నాయకులను కెసిఆర్ పక్కన పెట్టారు.

గతంలో తమకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని ఇచ్చిన హామీలు మరిచిపోయారని ,తీవ్ర అసంతృప్తికి గురయి రాజీనామా బాట పడుతుండటం టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది.ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకులు ఈ విషయంలో కలత చెందడం, తప్పనిసరిగా తమకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడం, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తమను తప్పించి కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడం పై సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.

తాజాగా టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ గా పనిచేస్తున్న గట్టు రామచంద్ర రావు,  కరీంనగర్ జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ మేయర్రవీందర్ సింగ్ రాజీనామా చేశారు.ఒకేరోజు ఇద్దరు సీనియర్ నేతలు రాజీనామా చేయడం టిఆర్ఎస్ లో సంచలనం రేపుతోంది.

ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఇబ్బంది కారంగా మారే అవకాశం కనిపిస్తోంది.

     రాజీనామా చేసిన గట్టు రామచంద్రరావు సీనియర్ రాజకీయ నాయకుడు 2015లో టిఆర్ఎస్ లోకి కేసీఆర్ పిలుపు మేరకు వచ్చారు పార్టీలో నూ, ప్రభుత్వంలోనూ కీలక స్థానాన్ని ఇస్తామని ఆయనకు అప్పట్లోనే హామీ ఇచ్చి చేర్చుకున్నారు.

  చెప్పినట్లుగానే పార్టీ జనరల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చినా, ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో నాన్చుతూ వస్తున్నారు.  ఎప్పటికప్పుడు అవకాశం వస్తుందని అన్నట్లుగా రామచంద్రరావు ఎదురుచూపులు చూస్తున్నారు.

  ప్రస్తుతం 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో,  వీటిలో తప్పనిసరిగా తమకు అవకాశం దక్కుతుందని రామచంద్రరావు భావించినా, ఆయన సంగతిని కెసిఆర్ పక్కన పెట్టేశారు.
 

Telugu Bjp, Gatturama, Harish Rao, Ravinder Singh, Trs, Ts Congress, Ts Potics-T

దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన తన రాజీనామా లేఖను తెలంగాణ భవన్ సెక్రటరీకి అందించారు.  అలాగే సీఎం కేసీఆర్,  మంత్రి కేటీఆర్ , సంతోష్ లకు వాట్సాప్ ద్వారా రాజీనామా లేఖను పంపించారు.తాను మీ అభిమానం పొందడం లో విఫలం అయ్యాను అంటూ లేఖలో పేర్కొన్నారు.

ఇక రవీందర్ సింగ్ విషయానికొస్తే 2009 ముందు కెసిఆర్ పిలుపుమేరకు బిజెపికి రాజీనామా చేసి ఆయన టిఆర్ఎస్ లో చేరారు.కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ కీలక నేతగా ఆయన ఉన్నారు.

  తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి కేసీఆర్ ప్రశంసలు అందుకున్నారు.ఆ సమయంలోనే అనేకమంది ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

  కానీ అప్పటి నుంచి ఆయనకు పదవి ఇచ్చే విషయంలో పక్కన పెడుతూ వస్తూ ఉండడం , కొత్తగా వచ్చిన నేతలను ప్రోత్సహించడం తదితర కారణాల తో రవీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తికి గురై పార్టీకి రాజీనామా చేశారు.
     ఈ పరిణామాలన్నీ ఇప్పుడు టిఆర్ఎస్ లో ఆందోళన కలిగిస్తోంది.

  ముఖ్యంగా కేసీఆర్ రాజీనామాల వ్యవహారం పై ఆరా తీసినట్లు సమాచారం.  పార్టీని బలోపేతం చేసి మళ్లీ అధికారంలోకి తీసుకు వెళ్ళాలనే ఆలోచన చేస్తుండగా ఈ రాజీనామాలు పార్టీ భవిష్యత్తును దెబ్బతీస్తాయని టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube