అమెరికా మంత్రి రాజీనామా..!!  

Resignation Of American Minister-

అమెరికా హోమ్‌ల్యాండ్‌ భద్రతాశాఖ మంత్రి క్రిస్టిన్‌ నీల్సన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు ఆమె ఒక లేఖని ట్రంప్ కి అందచేశారు. ఈమె ట్రంప్ నిర్ణయాలకి అనుగుణంగా ఎన్నో విధానాలని కొనసాగించారు..

అమెరికా మంత్రి రాజీనామా..!!-Resignation Of American Minister

అమెరికా వివాదాస్పద సరిహద్దు సరిహద్దు విధానాల కోసం పని చేశారు.

ఈమె మెక్సికో సరిహద్దు వద్ద గోడ నిర్మించాలన్న ట్రంప్‌ విధానాన్ని నీల్సన్‌ సమర్థించారు. బోర్డర్‌ వద్ద పటుకటున్న శరణార్థి కుటుంబాలను వేరు చేసిన వారిలో ప్రధాన పాత్ర నీల్సన్ దే కావడం గమనార్హం.

అయితే ట్రంప్ కి రాసిన లేఖలో హోమ్‌ల్యాండ్‌ సెక్యూర్టీ శాఖలో నేను పని చేయడం ఎంతో గర్వంగా ఉందని ఆమె తెలిపారు.

అమెరికా ఇప్పుడు ఎంతో సురక్షితంగా ఉందని నీల్సన్ అన్నారు. కానీ ఎందుకు రాజీనామా చేస్తుందో అనే విషయంపై ఆ లేఖలో ఇవ్వలేదు. ఇదిలాఉంటే ఆమె స్థానంలో కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రాటెక్షన్‌ కమిషనర్‌ కెవిన్‌ మెక్‌ అలీనమ్‌ బాధ్యతలు తీసుకుంటారని ట్రంప్ ట్వీట్ చేశారు.