వణికిపోతున్న విశాఖ జిల్లా వాసులు..!!

వర్షాకాలం అనంతరం విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు సాధారణంగా బయట పడతాయి.కానీ వర్షాకాలం నడుస్తూ ఉండగానే.

 Residents Of Visakhapatnam District Being Traded-TeluguStop.com

విశాఖ జిల్లాలో ప్రస్తుతం విషజ్వరాల సంఖ్య పెరిగిపోతుండటంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు.దీంతో విశాఖ కేజీహెచ్ విషపు జ్వరాల బాధితులతో నిండిపోయింది.

జ్వర పీడితుల లో అధికంగా.డెంగ్యూ బాధితులే.

 Residents Of Visakhapatnam District Being Traded-వణికిపోతున్న విశాఖ జిల్లా వాసులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

  ప్రభుత్వాసుపత్రుల తోపాటు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా కిటకిటలాడుతున్నాయి.ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో విషజ్వరాల బాధితులు పెరిగిపోతున్నారు.

 విషపు జ్వరాల బాధితులు పెరుగుతూ ఉండటంతో.జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది.

వాతావరణంలో మార్పు కారణంగా ముందుగానే వైరల్ ఫీవర్ లు బయటపడినట్లు వైద్యులు అంటున్నారు.ఈ క్రమంలో కరోనా ని దృష్టిలో పెట్టుకుని వైద్యం అందిస్తున్నట్లు.వైద్యులు తెలియజేస్తున్నారు.గాలిలో తేమ శాతం ఒక్కసారిగా పెరిగి పోవడంతో పాటు.

వాతావరణం రక రకాలుగా మారుతూ ఉండటంతో. విష జ్వరాలు ముందుగానే బయటపడినట్లు వైద్యులు చెపుతున్నారు.

ఈ క్రమంలో చాలావరకు ఫ్లూ టైపు జ్వరాలే బయట పడుతున్నాయని ఆ తరహాలోనే రోగులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పుకొస్తున్నారు.

#Traded #Malariya #Visakhapatnam #Andra Pradesh #Dengue

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు