ఆ గ్రామస్తులు కోటీశ్వరులు.. కానీ బట్టలే ధరించరు..!

ప్రపంచంలో వింతలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి.ఎన్నో రకాల వింతలు ఇప్పటికి మనం చూస్తూనే ఉన్నాము.

 Spielplatz People Of Uk Live Without Clothes , Britain, Without Clothes, Spielpl-TeluguStop.com

సోషల్ మీడియా ద్వారా ఎన్నో వింతలు బయటపడుతున్నాయి.ఇది కలియుగం అంటూ ఇక అన్ని వింతలు జరుగుతాయి అంటూ ఎంతోమంది అంటుంటే వింటున్నాం.

చూస్తున్నాం.ఇదిలా ఉంటే తాజాగా మరో వింత విషయం చోటు చేసుకుంది.

ఓ గ్రామంలో ప్రజలు బట్టలు వేసుకోకుండా తమ జీవనాన్ని గడుపుతారట.ఇది వినడానికి నిజంగా వింత గానే ఉంది.బహుశా వీళ్ళకు బట్టలు వేసుకోవటానికి డబ్బులు లేవంటే పొరపాటే.ఎందుకంటే ఆ గ్రామస్తులు మొత్తం కోటీశ్వరులే.

ఒకవేళ ఎవరైనా ఆ గ్రామం కి వెళితే వాళ్లు కూడా నగ్నం గా ఉండాల్సిందే.

యునైటెడ్ కింగ్ డమ్ లోని హెర్డ్ ఫోర్డ్ షైర్ లో స్పీల్ ప్లాట్జ్ అనే గ్రామం.

ఈ గ్రామంలో నివసించే ప్రజలు దాదాపు 85 సంవత్సరాల నుండి బట్టలు లేకుండా జీవిస్తున్నారు.మరో విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడున్న వారందరూ పై చదువులు చదువుకున్నారు.

అంతేకాకుండా వాళ్లంతా కోటీశ్వరులు.కానీ అక్కడున్న ప్రతి ఒక్కరూ బట్టలు లేకుండా జీవిస్తున్నారు.అలా ఉండటం వల్ల వాళ్ళకి అసౌకర్యం ఉండదట.అసలు విషయం ఏంటంటే 1929వ సంవత్సరంలో ఇసుల్ట్ రిచర్డ్ సన్ ఈ గ్రామాన్ని కనుగొన్నాడట‌.ఇక ఆ సమయంలో తన మిగతా జీవితాన్ని ఈ గ్రామంలో గడపాలని అనుకున్నాడట.ఈ గ్రామంలో పబ్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ కూడా ఉంది.

ఇక గ్రామంలో ప్రజలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రమే దుస్తులు ధరిస్తారట‌.ఇక ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, చలి వేసినప్పుడు బట్టలు వేసుకుంటారట‌.

కానీ ఈ గ్రామానికి ఎవరైనా వస్తే వాళ్లు కూడా వాళ్ళ ఆచారాన్ని పాటించాలట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube